యాంకర్ గా ఝాన్సీ ప్రేక్షకుల్లో ఆమె అభిమానుల్లో చెరగని ముద్ర వేశారు. యాంకర్ సుమ తర్వాత అంత పేరు ఉన్నది ఝాన్సీకే అని చెప్పాలి. సినిమాలలో, టివి సిరియల్స్ లల్లో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్స్ ఇలా ఎన్నో యాంకర్ గా తన మాటలతో ఆకట్టుకుంది. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ఫ్యామిలీ తోనే ఉంటుంది.
తాజాగా ఆమె చేసిన ఓ మంచి పనికి ఆమె అభిమానులు, ప్రేక్షకులు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇంతకు ఏంటి ఆమె చేసిన మంచి పని అంటే… కరోనా కాలంలో పెళ్లిలు ఫంక్షన్స్ మరియు ఇతరత్రా వేరే కార్యక్రమాలపై ప్రభుత్వం ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. 20 నుండి 30 మంది కంటే ఎక్కువ పర్మిషన్స్ ఇవ్వడం లేదు. యాంకర్ ఝాన్సీ తనకు కొడుకు వరసైన ఓ అబ్బాయి పెళ్లి ఇటీవలే జరిగింది.
ఆ పెళ్లి ని ఆమె లైవ్ వీడియో ద్వారా వీక్షించి వదువు వరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆమె సోషల్ మీడియా ద్వారా మాట్లాడుతూ.. ఆ పెళ్లి వేడుకకు వచ్చిన వారు మొత్తం కోవిడ్ నెగటివ్ సర్టిఫికేట్ ఉన్నవారే అని అన్నారు. అలాగే ఇంకో 200 నుండి 300 వందల మంది బందువులు స్నేహితులు, సన్నిహితులు ఆన్ లైన్ లో ఈ పెళ్లిని వీక్షించారు అని తెలిపింది.
కరోనా కారణంగ పెళ్లిలు కూడా ఆన్ లైన్ లో చూడాలిసి వస్తుందని ఝాన్సీ ఎమోషనల్ అయ్యారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు విధిగా మాస్క్ లు మరియు సానిటైజర్స్ వాడుతూ సోషల్ డిస్టెన్స్ పాటించాలి అని కోరారు.