![](https://i0.wp.com/filmytime.com/wp-content/uploads/2022/02/Anchor-anasuya-saree-pics-viral.jpg?resize=800%2C500&ssl=1)
యాంకర్ అనసూయ.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వాళ్లుండరంటే అతిశయోక్తి కాదు. ఇద్దరు పిల్లలకు తల్లి అయినా తన అందంతో ఎంతో మంది హీరోయిన్లు వెనక్కి తోసి తన టాలెంట్ ని నిరూపించుకుంటోంది. కేవలం యాంకర్ గానే కాకుండా… పలు సినిమాల్లో నటిస్తూ తన సత్తా చాటుతోంది.
![](https://i0.wp.com/filmytime.com/wp-content/uploads/2022/02/Anchor-anasuya-saree-pics-viral-1.webp?resize=819%2C1024&ssl=1)
అయితే జబర్దస్త్ ప్రోగ్రామ్ ద్వారా హాట్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు ట్రెండ్స్ ను ఫాలో అవతూ లక్షల్లో ఫాలోవర్స్ ను సొంతం చేసుకుంది. తాజా తాజా ఫొటోలతో తన అందాలను ఆరబోస్తూ… అభిమానులకు విందు చేస్తోంది.
![](https://i0.wp.com/filmytime.com/wp-content/uploads/2022/02/Anchor-anasuya-saree-pics-viral-2.webp?resize=683%2C1024&ssl=1)
తాజాగా వెరైటీ చీరకట్టులో అనసూయ భరద్వాజ్ తన ఫొటోలను షేర్ చేసింది. అయితే ఈ ఫొటోల్లో ఆమె లుక్ అదిరందంటూ… నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇంత అందాన్ని తట్టుకోలేకపోతున్నామంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. మీరు చేసే సినిమాలు చాలా బాగుంటున్నాయంటూ చెప్తున్నారు.
![](https://i0.wp.com/filmytime.com/wp-content/uploads/2022/02/Anchor-anasuya-saree-pics-viral-3.jpg?resize=1024%2C569&ssl=1)
అయితే అనసూయ ఇటీవలే పుష్ప సినిమాలో నటించింది. ఈ సినిమాలో చాలా కొత్తగా విలన్ పాత్రలో కనిపించిన ఈమెకు.. పుష్ప పార్ట్ 2 లో లీడింగ్ రోల్ ఉంటుందని అందరూ అంటున్నారు. రంగస్థలం సినిమాలో రంగమత్తగా చేసిన అనసూయ… పుష్ప సినిమాలో డిఫరెంట్ పాత్ర ఎంచుకొని ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేస్తోంది.