యాంకర్ అనసూయ జబర్దస్త్ షో ద్వారా యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే సినిమాల్లో మంచి మంచి పాత్రల్లో నటించింది. యాంకర్ గా కంటే సినిమాల్లో ప్రత్యేక పాత్రల ద్వారానే సరైన గుర్తింపు లభించింది. అనసూయ సోషల్ మీడియా ద్వారా కూడా బాగా యాక్టివ్ గా ఉంటారు. అభిమానులు అడిగిన చాలా ప్రశ్నలకు తన ఇంస్టా ఖాతా ద్వారా సమదానం ఇస్తూ ఉంటారు. అలాగే కాంట్రవర్సీ లు కూడా ఆమె చుట్టూ బాగానే ఉన్నాయి. ఆమె ధరించే బట్టలు నేటిజెన్స్ కు ఆగ్రహం తెప్పిస్తుండటంతో ఆమెపై బాగా ట్రోలింగ్ జరుగుతు ఉంటుంది.
తాజాగా అనసూయ ఓ ఇంటర్వ్యూ లో కొన్ని ఆసక్తికర విషయాలను తెలియజేసింది. యాంకర్, అనసూయను ప్రశ్నిస్తూ… మీ పిలల్లు మీ బట్టల విషయంలో అభ్యంతరం చెప్పలేదా ? మా పెద్ద వాడు మమ్మీ అలాంటి బట్టలు వేసుకోకు కొంచెం పెద్ద పెద్ద క్రాప్ టాప్ లు వేసుకో మమ్మీ చెబుతుంటాడు. అలాగే తనకు నచ్చకపోతే మొఖం మీదే నచ్చలేదు అని చెబుతుంటాడు. ఇంకా తన ఫ్యామిలీ గురించి చెబుతూ నేను డిగ్రీ చదివే రోజుల్లో మా ఇంట్లో చాలా రిస్ట్రిక్షన్స్ ఉండేవి. నా బట్టలు మా అమ్మ తీసి ఇచ్చేది.
నేను కుటుంబ అనుబందాలకు చాలా రెస్పెక్ట్ ఇస్తాను. నేను నా శరీరాన్ని ఓ దేవాలయం లాగా చూసుకుంటాను. మీకు ఎప్పుడైనా ఆడపిల్ల లేని లోటు కనిపించిందా అని యాంకర్ ప్రశ్నించగా.. అందుకు అనసూయ సమదానం ఇస్తూ ఖచ్చితంగా ఆడపిల్ల లేని లోటు కనిపిస్తుంది ఇంటికి ఆడపిల్ల మహాలక్ష్మి లాంటిది. నాకు కొంచెం బ్రీథింగ్ ప్రాబ్లం ఉంది అని అనసూయ తన పర్శనల్ విషయాలను వెల్లడించింది.