అనసూయ అంటే టక్కున గుర్తుకు వచ్చేది జబర్దస్త్. అవును ఈ షో ద్వారానే వెలుగులోకి వచ్చింది. జబర్దస్త్ కు ముందు సినిమాలో కనిపించింది కానీ అవేమీ ఆమెకు సరైన గుర్తింపు తీసుకురాలేదు. అందుకే అనసూయ తనకు ఎక్కడ నుండి బాగా పేరు వచ్చిందో అది మర్చిపోలేదు. అందుకే ఆ షోకు ఇప్పటికి యాంకర్ గా కొనసాగుతుంది. అనసూయ బుల్లి తెరపైనే కాకుండా వెండి తెరపైన కూడా ఓ వెలుగు వెలుగుతుంది. మంచి మంచి చిత్రాలల్లో కీలక పాత్రలు పోషిస్తుంది.
సినిమా రంగానికి చెందినవాడిని కాకుండా ఓ సాఫ్ట్ వేర్ అతన్ని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు ఈ జంటకు ఇద్దరు కొడుకులు వారికి సంబందించిన ఫోటోలు వీడియో లు అనసూయ తన అఫిషియల్ సోషల్ మీడియా అక్కౌంట్ లో పోస్ట్ చేస్తూనే ఉంటుంది. అప్పుడప్పుడు లైవ్ లోకి అభిమానులతో ముచ్చటిస్తు ఉంటుంది. అనసూయ పెళ్ళైన కూడా హాట్ హాట్ డ్రెస్ లు వేస్తూ కుర్రకారుకు హీట్ ఎక్కిస్తూ ఉంటుంది. నెటిజన్స్ ఆమె డ్రెసింగ్ తీరు మరియు ఆమె మాట తీరుపై బాగా ట్రోల్స్ చేస్తూ ఉంటారు. ఇది అనసూయ కు బాగా అలవాటైన విషయమే.
తాజాగా అనసూయ ఓ ఇంటర్వ్యూ లో తన ఫ్యామిలీ విషయాలను షేర్ చేసుకుంది. మా చిన్న తనంలో మాకు బాగా ఆస్తులు ఉండేవి.. మా నాన్న కు హార్స్ రేసింగ్, గ్యాంబ్లింగ్ అంటే బాగా పిచ్చి అందుకే మా ఆస్తులు అన్నీ పోయాయి. మేము మా చిన్నతనంలో చాలా రిచ్ గా జీవించాము. మా నాన్న గారు ఎప్పుడు నాతో స్వతంత్రం గా ధైర్యంగా జీవించాలని చెప్పేవారు. ఇతరులతో మేము ఎలా మాట్లాడుతామో అని ఓ కంట కనిపెట్టేవాడు. అని అంది. అనసూయ సినిమాల విషయానికి వస్తే ఆమె నటించిన థ్యాంక్యూ బ్రదర్ సినిమా ఆహాలో స్ట్రీమింగ్ అవ్వుతుంది. అలాగే సుకుమార్ పుష్ప చిత్రంలో ఓ కీలక పాత్ర లో నటిస్తుంది. రంగస్థలం చిత్రంలోని రంగమ్మత్త పాత్రకు మించి ఉంటుంది అని ఓకానొక ఇంటర్వ్యూ లో వెల్లడించింది.