విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా హీరోగా నటించిన విషయం తెల్సిందే. అయ్యో సినిమా ప్లాప్ అయినంత మాత్రాన అప్పుడే ఆనంద్ ను మర్చి పోయారా. అదేనండి జీవిత రాజశేఖర్ కూతురు శివాత్మికతో కలిసి దొరసాని అనే సినిమాను చేశాడు కదా, గుర్తుకు వచ్చింది కదా. మొదటి సినిమాతో నిరాశ పర్చిన ఆనంద్ దేవరకొండ రెండవ సినిమాకు చాలా గ్యాప్ తీసుకున్నాడు. రెండవ సినిమాను మిడిల్ క్లాస్ మెలోడీస్ అనే టైటిల్ తో చేశాడు.
ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ లాక్ డౌన్ కు ముందే దాదాపుగా పూర్తి అయ్యింది. ఆ బ్యాలన్స్ వర్స్ ను ఇప్పుడు పూర్తి చేసి సినిమాను విడుదలకు సిద్దం చేస్తున్నారు. సినిమా థియేటర్లు లేవు కదా ఎలా వస్తుందని అనుకుంటున్నారా.. ఈమద్య విడుదలైన అన్ని సినిమాల మాదిరిగా ఈ సినిమాను కూడా ఓటీటీ ద్వారా విడుదల చేయబోతున్నారు. అమెజాన్ వారు ఈ సినిమాను భారీ మొత్తానికి కొనుగోలు చేశారట.
దొరసాని సినిమా ప్లాప్ తో ఈయన కొత్త సినిమా కోటి మార్కట్ అయినా దక్కించుకుంటుందా అంటూ చాలా మంది చాలా రకాలుగా అనుమానాలు వ్యక్తం చేశారు. అందుకే ఈ మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాను కేవలం రెండు కోట్ల లోపుతో తెరకెక్కించారట. కాని అమెజాన్ వారు మాత్రం ఏకంగా ఈ సినిమాను రూ.4 కోట్లకు కొనుగోలు చేశారంటూ సమాచారం అందుతోంది. ఆనంద్ దేవరకొండ మూవీకి థియేట్రికల్ రైట్స్ కూడా ఇంతగా వచ్చి ఉండేవి కావని, నిజంగా అమెజాన్‌కు ఈ సినిమాను ఇచ్చి నిర్మాత లాభం దక్కించుకున్నాడు అంటున్నారు.
అందుకే చిన్న సినిమాల పాలిట ఓటీటీలు వరంగా మారాయి అనడంలో సందేహం లేదు. రెండవ సినిమాతో అయినా ఆనంద్ దేవరకొండ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకుంటాడా చూడాలి. వచ్చే నెలలో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. మొదటి సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఈ సినిమా లైఫ్ అండ్ డేట్ మేటర్ గా మారింది. ఈ పరిస్తితి నుండి ఆనంద్ ఎలా బయటపడుతాడో చూడాలి