సినిమాకు పోటీగా డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లు వచ్చాయి. చాలా వరకు సినిమాలు ఇప్పుడు అక్కడే విడుదల అవ్వుతున్నాయి. కరోనా వైరస్ దయ వలన వీటికి డిమాండ్ మరింత పెరిగింది. లాక్ డౌన్ సమయంలో చిన్న పెద్ద సినిమాలు అక్కడే విడుదల అయ్యి మంచి హిట్టు ను దక్కించుకున్నాయి. డిజిటల్ రంగంకు ఫ్యూచర్ లో మంచి భవిష్యత్తు ఉండబోతుంది. కావున కొత్తగా కొన్ని డిజిటల్ ప్లాట్ ఫామ్ లు పుట్టుకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చిందే ఆహా, అల్లు అరవింద్ నిర్మాణలో ఆహా కు ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది.
పలు మలయాళ సూపర్ హిట్టు సినిమాలను డబ్బ్ చేసి సక్సెస్ ఫుల్ గా సబ్ స్క్రైబర్స్ ను పెంచుకుంటూ పోతుంది. ఈ నేపథ్యంలో సినిమాల తో పాటుగా వెబ్ సిరీస్ లను కూడా నిర్మిస్తుంది. తాజాగా మలయాళం ముద్దుగుమ్మ అమలపాల్ నటించిన ఓ వెబ్ సిరీస్ ఇప్పుడు పూర్తి చేసుకుంది. మొత్తం 8 ఎపిసోడ్ లుగా ఇది రాబోతుంది. ఈ వెబ్ సిరీస్ కు పవన్ కుమార్ దర్శకత్వం వహించాడు. గతంలో ఆయన అక్కినేని సమంత లీడ్ రోల్ లో వచ్చిన యూ టర్న్ చిత్రానికి దర్శకత్వం వహించాడు.
ఇప్పుడు అమల పాల్ ను లీడ్ రోల్ లో పెట్టి భారీ బడ్జెట్ తో ఆహా కోసం వెబ్ సిరీస్ ను తెరకెక్కించాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. త్వరలో ఆహాలో విడుదల కానున్నది. వెబ్ సిరీస్ బాటలోలో తమన్న, కాజల్ అగర్వాల్, సమంత వంటి స్టార్ హీరోయిన్స్ అడుగులు వేస్తున్నారు. బాలీవుడ్, టాలీవుడ్ హీరోలు సైతం వెబ్ సిరీస్ లో నటించేందుకు సిద్దంగా ఉన్నారు. సినిమాకు పోటీగా వెబ్ సిరీస్ ను ప్రేక్షకులు బాగా అదరిస్తున్నారు.