అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప చిత్రాన్ని చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇంకా ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవ్వలేదు. ఈ సమయంలోనే కొరటాల శివ మూవీ కూడా కన్ఫర్మ్ అయ్యింది. ఇటీవలే అల్లు అర్జున్ మరియు కొరటాల శివల కాంబో మూవీ అధికారిక ప్రకటన వచ్చింది. ఈ చిత్రాన్ని కొరటాల సన్నిహితుడు మరియు గీతాఆర్ట్స్ బన్నీ వాసు కలిసి నిర్మించబోతున్నారు. ఈ చిత్రం షూటింగ్ వచ్చే ఏడాదిలో ప్రారంభం అయ్యి సినిమా 2022లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ కాంబో పై అప్పుడే అంచనాలు పీక్స్ కు చేరాయి.
ప్రస్తుతం ఆచార్య చిత్రాన్ని చేస్తున్న కొరటాల శివ బన్నీ కోసం స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశాడంటూ సమాచారం అందుతోంది. తన ప్రతి సినిమాలో కూడా సామాజిక అంశాలను సున్నితంగా టచ్ చేస్తూ కమర్షియల్ ఎంటర్టైనర్గా సినిమాలను చేస్తున్న కొరటాల శివ ఆచార్య చిత్రంలో దేవాలయాల్లో జరుగుతున్న అవినీతి గురించి చూపించడం జరుగుతుందట. చిరంజీవితో పాటు ఆచార్య చిత్రంలో రామ్ చరణ్ ఉండబోతున్నాడు. ఆచార్య చిత్రం కరోనా కారణంగా ఆగిపోయింది. కరోనా టెన్షన్ తగ్గిన తర్వాత చిరంజీవి ఆచార్య షూట్లో పాల్గొనబోతున్నారు. ఆచార్య చిత్రం షూటింగ్ పూర్తి అయిన తర్వాత బన్నీతో మూవీ మొదు అయ్యే అవకాశం ఉంది.
ఇక బన్నీ కోసం కూడా ఒక సామాజిక సమస్యను కొరటాల ఎంపిక చేసుకున్నట్లుగా సమాచారం అందుతోంది. కెమికల్ ఫ్యాక్టరీల వల్ల జరిగే నష్టాలు వాటికి ప్రభుత్వం నుండి దక్కే అనుమతుల గురించి సినిమాలో చూపించబోతున్నారట. కొన్ని రోజుల క్రితం విశాఖలో జరుగుతున్న గ్యాస్ లీకేజీకి సంబంధించి కూడా ఈ చిత్రంలో కొన్ని కీలక సన్నివేశాలు ఉంటాయంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్‌కు డైలాగ్ వర్షన్ రాస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం కొరటాల శివ తన శిష్యులతో వెబ్ సిరీస్‌కు ప్లాన్ చేస్తున్నాడు. ఎప్పుడైతే షూటింగ్స్ కు చిరంజీవి ఓకే చెప్తాడో అప్పుడు రంగంలోకి దిగే అవకాశం ఉంది.