![](https://i0.wp.com/filmytime.com/wp-content/uploads/2022/02/allu-arha-cute-dance-on-kaccha-badam-song.jpg?resize=800%2C500&ssl=1)
ఎక్కడ చూసినా, ఎవరి నోటా విన్నా కచ్చా బాదం పాటనే వినబడుతోంది. ఇన్ స్టా, ట్విట్టర్, యూట్యాబ్, ఫేస్ బుక్… ఇలా ఏ సోషల్ మీడియా వెబ్ సైట్ ఓపెన్ చేసినా… ఈ పాటకు అభిమానులు వేస్తున్న డ్యాన్సులే కనిపిస్తున్నాయి. ఈ పాటకు అర్థం తెలియకపోయినా.. వినసొంపుగా ఉండటంతో.. అందరూ తమదైన శైలిలో స్టెప్పులు వేస్తూ.. అందర్నీ అలరిస్తున్నారు.
![](https://i0.wp.com/filmytime.com/wp-content/uploads/2022/02/allu-arha-cute-dance-on-kaccha-badam-song-1.webp?resize=650%2C400&ssl=1)
అయితే పాత సామన్లు కొనే ఓ వ్యక్తి రూపొందించి పాడిన పాట.. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సామాన్య ప్రజల నుంచి స్టార్ సెలబ్రిటీల వరకు ఈ పాటకు డ్యాన్స్ చేస్తూ.. తమ సోషల్ మీడియా అకౌంట్లలో అప్ లోడ్ చేస్తున్నారు.
తాజాగా ఇదే పాటకు అల్లు అర్జున్ కూతురు.. అల్లు అర్హ స్టెప్పులు వేసింది. క్యూట్ క్యూట్ గా డ్యాన్స్ చేస్తూ.. స్టెప్పులేసింది. అయితే బన్నీ కూతురు డ్యాన్స్ చేస్తుండగా.. అల్లు అర్జున్ వీడియో తీశాడు. దానిని సోషల్ మీడియాలో షేర్ చేసి.. మై లిటిల్ బాదం అర్హ అంటూ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ పాటతో అర్హ వేసిన స్టెప్పులు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
![](https://i0.wp.com/filmytime.com/wp-content/uploads/2022/02/allu-arha-cute-dance-on-kaccha-badam-song-2.jpg?resize=1024%2C640&ssl=1)
ఈ వీడియో చూసిన ప్రతీ ఒక్కరూ.. అల్లు అర్హ చాలా క్యూట్ గా డ్యాన్స్ చేస్తుందంటూ… కామెంట్లు చేస్తున్నారు. ఏంజల్ లా ఉందంటూ కొందరు.. నైస్ డ్యాన్స్ అంటూ మరి కొందరు చెబుతున్నారు.