దర్శకుడు ఈవివి సత్యనారాయణ కొడుకుగా అల్లరి నరేశ్ సినిమాలోకి వచ్చి అల్లరి సినిమాతో అల్లరి సృష్టించి అందరిని ఆకర్షించాడు. కామిడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచాడు. ఆనాటి కమెడియన్ రాజేంద్ర ప్రసాద్ స్థానం ను అల్లరి నరేశ్ భర్తీ చేస్తాడు అంటూ వార్తలు వచ్చాయి. మొదటి నుండి కూడా కామిక్ సినిమాలను నమ్ముకుంటూ వస్తున్నాడు. ఎప్పుడు రొటీన్ కామిడీ ప్రేక్షకులకు బోర్ కొట్టేసింది. అందుకే ఈ మధ్య ఆయన నటించిన చిత్రాలు నిరాశ పరిచాయి.
తాజాగా ఆయన నటించిన చిత్రం అల్లరి బుల్లోడు విడుదల అయ్యింది గ్రామీణ నేపథ్యంతో కూడిన కామిడీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం విడుదల అయింది. కానీ ప్రేక్షకులను మాత్రం నవ్వించలేక పోయింది. టాలీవుడ్ టాప్ కామెడియన్స్ అందరూ ఈ చిత్రంలో నటించిన నిరాశే మిగిలింది. ఆయన నమ్మకం అంత ఇప్పుడు నాంది సినిమాపై పెట్టుకున్నాడు. విజయ్ కనకమేడల ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో నటించింది. ప్రియదర్శి మరో కామిడీ రోల్ ని పోషించాడు.
ఈ చిత్రం యొక్క పూర్తి నెగటివ్ రైట్స్ (థియేటరీకల్, శాటిలైట్, డిజిటల్ రైట్స్) ను జీ సంస్థ 8.5 కోట్లకు దక్కించుకుంది. ఈ చిత్రం యొక్క నిర్మాత సతీష్ వేగేశ్న జీ తో ఒప్పందం కుదుర్చుకున్నారు. త్వరలో అగ్రిమెంట్ పై సైన్ చెయ్యనున్నాడు. ఈ చిత్రంపై అల్లరి నరేశ్ చాలా ఓప్స్ పెట్టుకున్నాడు. ఆయన ఈ చిత్రంతో ఎలాగైనా విజయం సాదించాలని చూస్తున్నాడు. నాంది చిత్రానికి శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు.