ఎన్టిఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత చిత్రం ఎంతటి ఘన విజయం సాదించిందో మనం ఆల్రెడీ చూశాం. తారక్ ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ అవ్వబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రిప్ట్ వర్క్ మరియు ప్రీ ప్రొడక్షన్ పనిలో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం పాన్ ఇండియా సినిమా గా రూపొందించాలని ప్లాన్ చేస్తున్నాడు. అందుకే బాలీవుడ్ నుండి తారాగణం ను రంగంలోకి దింపే ఆలోచనలో ఉన్నాడు.
ఈ చిత్రంలో ఆనాటి నటీమణి అన్సు అంబానీ ఓ ముఖ్య పాత్రలో నటింప చేయడానికి ఆమెతో త్రివిక్రమ్ సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఈమె గతంలో నాగార్జున మన్మధుడు చిత్రం తో పరిచయం అయింది. ఆ తర్వాత సురేశ్ కృష్ణ డైరెక్షన్లో, ప్రభాస్ హీరోగా వచ్చిన రాఘవేంద్ర సినిమాలో శిరీష అనే పాత్రలో నటించింది. మిసమ్మ సినిమాలో ఓ గెస్ట్ రోల్ లో నటించి ఆ తర్వాత సినిమా ఇండస్ష్ట్రి కి పూర్తి గా దూరం అయింది. తమిళంలో జై అనే ఒక్క చిత్రంలోనే నటించింది. ఆ తర్వాత లండన్ కు చెందిన సచిన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని అక్కడే స్థిర పడింది. ఇప్పుడు వారికి ఓ పాపకూడ ఉంది.
అక్కడే భర్తకు తోడుగా బిజినెస్ పనులు చూసుకుంటుంది. మరల 17 ఏండ్ల తర్వాత ఎన్టిఆర్, త్రివిక్రమ్ సినిమా కోసం ముఖానికి రంగువేసుకొనున్నది. త్వరలోనే ఈ చిత్రంలోని ఈమె పాత్రపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ మలయాళం మూవీ లూసిఫర్ తెలుగు రీమేక్ చిత్రానికి స్క్రీన్ ప్లే మరియు మాటలు అందిస్తున్నాడు. తారక్ మాత్రం ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్ చిత్రీకరణ లో ఉన్నాడు.