సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ ఫ్యామిలీ విషయానికి వస్తే… కృష్ణ గారు మొదట ఇందిరా దేవిని పెళ్లి చేసుకున్నారు. వీరికి మొత్తం ఐదుగురు.. అందులో సినిమా ఇండస్ష్ట్రి కి సంబందించిన వారు ముగ్గురు ఉన్నారు. మహేష్ బాబు, రమేష్ బాబు, మంజుల. ఆ తర్వాత కృష్ణ గారు ప్రముఖ దర్శకురాలు మరియు నటి అయిన విజయ నిర్మలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అప్పటికే ఆమెకు పెళ్లి అయింది. ఆమెకు నరేష్ అనే కొడుకు ఉన్నాడు. ఇతను కూడా సినిమాల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నాడు.
సినిమాకు సంబందించిన వారిలో చాలా మంది రెండు లేక మూడు పెళ్లిలు చేసుకున్నవారు ఉన్నారు. అందులో సీనియర్ హీరో నరేష్ కూడా ఒక్కరు. ఈ విషయంపై ఆయన ఓ యూట్యూబ్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో వివరణ ఇచ్చాడు. నాకు 19 ఏండ్ల వయసులో పెళ్లి చేశారు. అప్పుడు మా ఇద్దరి మధ్య తరచు మనస్పర్థలు, గొడవలు వచ్చేవి ఆ కారణం చేత ఇద్దరి అంగీకారం మేరకు విడాకులు తీసుకొని విడిపోయాం. ఆ తర్వాత రెండో పెళ్లి కూడా అలాగే జరిగింది. మూడో పెళ్లి రమ్య రఘుపతి అనే ఆమెను పెళ్లి చేసుకున్నాను. రఘువీరా రెడ్డి అన్న కూతురు. మాది ప్రేమ వివాహం. మా ప్రేమను పెద్దలకు చెప్పి పెళ్లి చేసుకున్నాం. ఆమె దర్శకత్వ విభాగంలో శిక్షణ తీసుకుంది.
మూడోవ పెళ్లి చేసుకున్నా నేను కొంత మేరకు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కున్నాను. రాజకీయాల వలన హీరోగా కొనసాగాలిసిన నా కెరీర్ చాలా డిస్టబ్ అయ్యింది. అని నరేష్ అన్నాడు. మహేష్ బాబు రమేష్ బాబు ఫ్యామిలీ మేము అంత చాలా మంచిగా ఉంటాం. మేము చిన్నప్పటి నుండి అంత కలిసే పెరిగాము. మహేష్ బాబు, మా అమ్మ గారు చనిపోయినప్పుడు అంత దగ్గర ఉండి తాను ఒక్కడై చూసుకున్నాడు అంటూ ఎమోషనల్ అయ్యాడు. నరేష్ ప్రస్తుతం సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నాడు.