![](https://i0.wp.com/filmytime.com/wp-content/uploads/2022/03/Aadavallu-meeku-joharlu-first-day-nizam-collection-here.jpg?resize=800%2C500&ssl=1)
శర్వానంద్, రష్మికా మందన్నా జంటగా తెరకెక్కిన చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు. ఈ సినిమాకు కిషోర్ తిరుమల దర్శకత్వం వహించారు. ఈ వారంలో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ అయిన తాజా చిత్రాల్లో ఆడవాళ్లు మీకు జోహార్లు కూడా ఒకటి. అయితే ఈ మూవీ ప్రేక్షకుల నుంచి మిక్స్ డ్ టాక్ అందుకుంటోంది. అన్ని సెంటర్లలోనూ మంచి వసూళ్లనే రాబట్టింది ఈ చిత్రం.
![](https://i0.wp.com/filmytime.com/wp-content/uploads/2022/03/Aadavallu-meeku-joharlu-first-day-nizam-collection-here-1.webp?resize=1024%2C576&ssl=1)
ఆడవాళ్లు మీకు జోహార్లు మూవీకి మొదటి రోజు 80 లక్షల రూపాయల షేర్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ కలెక్షన్స్ రావడం నిజంగా మంచిదనే ఫిల్మ్ వర్గాలు అంటున్నాయి. అలాగే ఈ వారాంతానికి కూడా మంచి ఫిగర్ అందుకునే అవకాశం ఉందని చెప్పొచ్చు. కానీ ఫైనల్ రన్ లో ఈ మూవీ ఎక్కడ చతికిల పడుతుందో కాలమే చెబుతుంది.
![](https://i0.wp.com/filmytime.com/wp-content/uploads/2022/03/Aadavallu-meeku-joharlu-first-day-nizam-collection-here-2.jpg?resize=1024%2C768&ssl=1)
ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలో భారీ తారాగణమే ఉంది. ఖుష్బూ, ఊర్వశి, రాధిక, వెన్నెక కిషోర్, రవి శంకర్, సత్య, ప్రదీప్ రావత్, గోప రాజు, కల్యాణీ నటరాజన్, రాజశ్రీ నాయర్, ఝాన్సీ, రజిత, సత్య కృష్ణ ముఖ్య పాత్రల్లో నటించారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా.. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ చేశారు.