సందీప్ కిషన్ సక్సెస్ ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. అందులో భాగంగా ఈ సినిమాను చేసేశాడు. తమిళ మూవీ నట్పే తుణై కి రీమేక్ గా రూపొందిన ఈ సినిమా లో హాకీ నేపథ్యంలో కథ సాగుతుంది. సందీప్ కిషన్ ఎనర్జీ మరియు తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా కాస్త మార్పులు చేర్పులు చేసి ఈ సినిమాను తీశారట. ఈ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం.
కథః
సందీప్ (సందీప్ కిషన్) ఫ్రాన్స్ వెళ్లి సెటిల్ అవ్వాలనుకుంటూ కలలు కంటూ ఉంటాడు. తన కల సాకారం చేసుకునేందుకు ఒకానొక సమయంలో యానాం వెళ్లాల్సి వస్తుంది. అక్కడ హకీ ప్లేయర్ అయిన లావణ్య(లావణ్య త్రిపాఠి) ని చూసి ప్రేమిస్తాడు. ఇద్దరి మద్య ప్రేమ చిగురించి ప్రేమలో ఉన్న సమయంలో అనూహ్యంగా యానాంలోని ఛారిత్రాత్మక హాకీ స్టేడియంను మంత్రి తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాంటి సమయంలో ఒక హాకీ మ్యాచ్ ఆడి ఆ స్టేడియంను దక్కించుకోవాల్సి వస్తుంది. హాకీ ప్లేయర్ అయిన సందీప్ ను వారు సాయం చేయమని అడుగుతారు. అప్పుడు సందీప్ ఏం చేస్తాడు అనేది కథ.
విశ్లేషణః
ఒరిజినల్ వర్షన్ కు కాస్త ఎక్కువ మార్పులే చేసినట్లుగా అనిపిస్తుంది. పెద్ద ఎత్తున ఎంటర్ టైన్ మెంట్ సీన్స్ తో పాటు కాస్త ఎమోషనల్ సీన్స్ ను కూడా జోడించారు. సంగీతం మొదటి నుండి అనుకుంటున్నట్లుగా ఆకట్టుకుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో కూడా మంచి మార్కులు పడ్డాయి. హీరో సందీప్ కిషన్ మరియు హీరోయిన్ లావణ్య త్రిపాఠిలు వారి పాత్రల పరిధిలో నటించి మెప్పించారు. ఇద్దరి మద్య రొమాన్స్ ను హైలైట్ చేయలేదు. అయితే ఇద్దరు కూడా హాకీ ప్లేయర్స్ గా కనిపించేందుకు చేసిన ప్రయత్నం నిజంగా అభినందనీయం.
ఇక దర్శకుడు మక్కీకి మక్కీ అన్నట్లుగా మార్చే ప్రయత్నం చేశాడు. అయితే కథనంను ఇంకాస్త సీరియస్ గా నడిపించి అదే సమయంలో ఎంటర్ టైన్ మెంట్ ను కూడా లోపించకుండా చూసుకుంటే బాగుండేది. కథ విషయంలో పెద్దగా మార్పులు చేయలేదు. స్క్రీన్ ప్లే లో రీమేక్ కోసం చేసిన మార్పులు చిన్న చిన్నవి డెప్త్ ను మిస్ చేశాయి. మొత్తంగా ఈ సినిమా ఒక మోస్తరు గా ఉంది. సందీప్ కిషన్ ను అభిమానించే వారు ఆయన కోసం చూడవచ్చు. ఇక ఈ సినిమా ను రెగ్యులర్ టైమ్ పాస్ కు కూడా చూడవచ్చు.
ప్లస్ పాయింట్స్ః
సందీప్ కిషన్,
హాకీ సన్నివేశాలు,
వినోదం
రావు రమేష్ పాత్ర
మైనస్ పాయింట్స్ః
కథనం,
దర్శకత్వం,
ఎడిటింగ్,
అక్కడక్కడ తమిళ ప్లేవర్
చివరగా...
హకీని, సందీప్ కిషన్‌ని, లావణ్యను ఇష్టపడే వారు తప్పకుండా చూడద్దగ సినిమా… మిగిలిన ఆడియన్స్ కి ‘A1 ఎక్స్ ప్రెస్’ ఒక సాధారణమైన సినిమా..OTT లో చూడటానికి వేచి చూడవచ్చు.
రేటింగ్ః 2.75/5.0