లెజెండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఇంట్లో విషాద ఛాయలు అల్లుకున్నాయి. ఆయన తల్లి కరీమా బేగం సోమవారం తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె పరిస్థితి విషమించడంతో సోమవారం కన్నుమూశారు. కరీమాకు నలుగురు సంతానం కాగా.. రెహమాన్ చిన్నవాడు. 9 ఏళ్ల వయసులోనే రెహమాన్ తండ్రి ఆర్కే శేఖర్ చనిపోగా.. ఇప్పుడు తల్లిని కూడా చనిపోయింది. వయసుతోపాటు వచ్చిన అనారోగ్య సమస్యల కారణంగానే కరీమా మరణించినట్టు తెలుస్తుంది.
రెహమాన్‌కు తల్లితో అనుబంధం ఎక్కువ. ఈ విషయాన్ని ఆయన అనేక ఇంటర్వ్యూల్లో చెప్పేవారు. తాను కెరీర్లో ఎదిగే క్రమంలో ప్రతి కీలక ఘట్టంలో తల్లి నిర్ణయాలు, మద్దతు ఉన్నాయని వెల్లడించేవారు. కరీమా బేగం మృతిపట్ల పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.