నటిగా రోజా ఎంత పేరు పాపులారిటి సంపాదించుకుందో ప్రతి ఒక్కరికి తెలుసు. 90’s లో రోజా తెలుగు, తమిళ సినిమా ఇండస్ష్ట్రి ని తన అందం అభినయంతో మంచి పేరును తెచ్చుకుంది. అప్పట్లో హీరోల ఫ్యాన్స్ కంటే రోజాకు ఎక్కువగా ఫ్యాన్స్ ఉండేవారు. ఇక ఆ సమయంలోనే దర్శకుడు సెల్వమణి ని పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అయ్యింది.
చాలా కాలం హౌస్ వైఫ్ గా ఉన్న రోజా భర్త సహకారంతో రాజకీయాల్లోకి వచ్చింది. ముందుగా టిడిపి లోకి వచ్చిన రోజా ఆ తర్వాత వైఎస్ఆర్సిపి పార్టీలో చెరీ కీలక సభ్యురాలిగా కొనసాగుతుంది. రాజకీయాల్లో ఉన్న తను ఎక్కడి నుండి వచ్చిందో అది మర్చిపోలేదు. అందుకే ఇప్పటికీ సినిమాల్లో చాలా మంచి మంచి పాత్రలు చేస్తూనే బుల్లి తెరపై జబర్దస్త్, బతుకు జట్కా బండి వంటి షో లకు జడ్జ్ గా కొనసాగుతుంది. రోజా ఫ్యామిలీ విషయానికి వస్తే ఆమెకు ఇద్దరు పిల్లలు ఓ అమ్మాయి ఓ అబ్బాయి. అమ్మాయి పేరు అన్షు మాలిక, అచ్చం తల్లి రోజాలాగే ఉంటుంది.
కూతురు అన్షు మాలిక ను ఆమె బర్త్ డే సందర్భంగా ఇంట్రడ్యూస్ చేసింది. అప్పటి నుండి రోజా తన కూతురు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంది. ఇటీవల అనారోగ్యానికి గురైన రోజా ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. రోజా కూతురు అన్షు మాలిక మాత్రం రీసెంట్ గా ఇంస్టా లోకి అడుగు పెట్టింది. ఈ క్రమంలో ఆమె తన ఫాలోవర్స్ ను పెంచుకోవడానికి క్వచన్ అండ్ ఆన్సర్స్ ద్వారా తన అభిమానులతో ముచ్చటిస్తుంది. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ ఐ లవ్ యు అంటూ ప్రపోజ్ చేశాడు. అందుకు రోజా కూతురు ఐ లవ్ యు థాంక్ యు అంటూ రిప్లే ఇచ్చింది. ప్రస్తుతం ఆ రోజా కూతురు రీప్లే ఇచ్చిన స్క్రీన్ షాట్ ఫోటో బాగా వైరల్ అవ్వుతుంది. తల్లి లాగే అన్షు మాలిక కు కూడా చాలా డేర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.