మాస్ మహారాజ్ రవి తేజ ఈ ఏడాది గోపిచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్ చిత్రంతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. వరస ఫ్లాప్స్ తో ఉన్న రవితేజ కు ఈ చిత్రం మంచి బూస్టింగ్ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే రమేశ్ వర్మ దర్శకత్వంలో ఖిలాడి అనే చిత్రాని మొదలు పెట్టాడు. ఇప్పటికే ఫస్ట్ లుక్ అండ్ ఫస్ట్ గ్లింప్స్ తో ఆకట్టుకున్నాడు. ఈ చిత్రంలో డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు ఏ స్టూడియోస్ ఎల్ఎల్పి బ్యానర్ పై సత్యనారాయణ కోనేరు, రమేశ్ వర్మలు నిర్మిస్తున్నారు.
ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంలోని కీలక పాత్రలో కన్నడ యాక్షన్ కింగ్ అర్జున్ సార్జ, మలయాళం హీరో ఉన్ని ముకుందన్ లు నటిస్తున్నారు. మే 28న ఈ చిత్రం విడుదల అవ్వుతుంది. ఈ చిత్రం సెట్స్ పైన ఉండగానే రవి తన తదుపరి సినిమాను లైన్ లో పెట్టాడు. నాని నేను లోకల్, రామ్ పోతినేని హలో గురు ప్రేమ కోసమే వంటి సూపర్ హిట్టు చిత్రాలను తీసిన నక్కిన త్రినాద్ రావు దర్శకత్వంలో మాస్ మహారాజ్ తన 68వ సినిమాను లైన్లో పెట్టాడు. కాసేపటి క్రితమే అధికారికంగా ప్రకటించడం జరిగింది.
ఈ చిత్రాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థలపై టిజి విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ వివేక్ కుచ్చుబొట్ల లు నిర్మిస్తున్నారు. వచ్చే నెల చివరి నుండి రేగ్యూలర్ గా షూటింగ్ జరగనున్నది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి. క్రాక్ చిత్రం అందించిన విజయంతో రవితేజ మరల మునపటి ట్రాక్ లోకి వచ్చాడు. ఈ ఏడాది మూడు సినిమాలను విడుదల చేసే ఆలోచనలో ఉన్నాడు