బాహుబలి స్టార్ ప్రభాస్, కేజిఎఫ్ స్టార్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సలార్ అనే చిత్రం రూపొందుతుంది. ఇప్పటికే మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. సెకండ్ షెడ్యూల్ షూటింగ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంను మొదలు పెట్టకముందే. సలార్ లో నటించేందుకు నూతన నటి నటీమణులు కావాలని ఇది వరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ అడిషన్స్ జరుగుతున్నాయి.
హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీ అందుకు వేధిక అయింది. ప్రభాస్ తో సినిమా ఛాన్స్ అనే సరికి రెండు తెలుగు రాష్ట్రాల నుండి కాక ఇతర రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో అడిషన్స్ కు వచ్చారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ ఆద్వర్యంలో ఈ అడిషన్స్ జరిగాయి. దాదాపుగా వంద మందిని సెలెక్ట్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇందులో డ్యాన్సర్, ఫైటర్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది.
సలార్ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. కన్నడ నటుడు మధు గురుస్వామి విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ప్రభాస్ కు ధీటుగా మధు గురుస్వామి చేరడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ చిత్రంలో ప్రభాస్ మెకానిక్ పాత్రలో కనిపిస్తాడు అని అంటున్నారు. కేజిఎఫ్ చిత్రాని నిర్మించిన హేంబలే విజయ్ కిరంగధుర్ సలార్ చిత్రాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. రవి బశృర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కి విడుదల అవ్వుతుంది.