బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఆర్‌ఆర్‌ఆర్. ఈ చిత్రంలో ఇద్దరు స్టార్ హీరోలు అయిన ఎన్‌టిఆర్, రామ్ చరణ్ లు నటిస్తున్నారు. పాన్ ఇండియా నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం కావున మొదటి నుండి కూడా ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్రం యొక్క తమిళ థియేట్రికల్ రైట్స్ ను ప్రముక నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ దక్కించుకుంది.
మొదటి నుండి కూడా రాజమౌళి ఈ చిత్రం యొక్క హక్కులను భారీ ధరలకు నిర్ణయిస్తున్నాడు. ఈ క్రమంలో తమిళ హక్కులను 50 కోట్లకు డిసైడ్ చేయగా 45 కోట్లకు దక్కించుకున్నట్లు గా వార్తలు వచ్చాయి. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మేము ఆర్‌ఆర్‌ఆర్ తమిళ హక్కులను దక్కించుకునందుకు చాలా సంతోషం గా ఉందని లైకా ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. బాహుబలి 2 థియెట్రీకాల్ హక్కులు 37 కోట్లకు అమ్ముడు పొగ, ఇప్పుడు ఆ మొత్తాన్ని ఆర్‌ఆర్‌ఆర్ క్రాస్ చేసింది.
ఈ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుంటే, ఎన్‌టిఆర్ కొమురమ్ భీమ్ పాత్రలో నటిస్తున్నాడు. బాలీవుడ్ కు చెందిన అలియ, హాలీవుడ్ కు చెందిన ఒలివియా మోరిస్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అజయ్ దేవగన్, సముద్రఖని లు కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం యొక్క షూటింగ్ ఆర్‌ఎఫ్‌సి లో క్లైమాక్స్ కు సబందించిన యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రం కోసం డివివి దానయ్య 450 కోట్లు వరకు ఖర్చు పెట్టాడు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. దసరాకు అంటే అక్టోబర్ 13న ఈ చిత్రం విడుదల అవ్వుతుంది.