గోపీచంద్ మలినేని యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు. రీసెంట్ గా రవితేజతో క్రాక్ చిత్రం తీసి మంచి హిట్టును అందుకున్నాడు. వరస ఫ్లాప్స్ తో వస్తున్న మాస్ మహారాజ్ కు ఈ చిత్రం మంచి ఊరటను ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే గోపిచంద్ మలినేని మరో కథను సిద్దం చేస్తున్నాడు. ఇది ఆయన సొంతంగా తయారు చేసుకున్న కథ. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఆయన తదుపరి సినిమాను నందమూరి బాలకృష్ణ తో చేయనున్నాడు. ఈ చిత్రాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్నారు. ఉప్పెన ప్రమోషన్ కార్యక్రమంలో ఈ విషయాన్ని వారు తెలియజేశారు.
వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అనేసరికి అంచనాలు భారీగా ఉండనున్నాయి. నందమూరి అభిమానులు కూడా బాలకృష్ణ నుండి మరో యాక్షన్ మూవీని ఆశిస్తున్నారు. ఇక ఈ చిత్రం యొక్క షూటింగ్ ఏప్రిల్ నెలనుండి జరగనున్నదని సమాచారం. ఈ చిత్రాని వచ్చే ఏడాది సంక్రాంతి భరిలో బాలకృష్ణ సినిమా కూడా పోటీ పదనున్నది. ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ పవర్ ఫుల్ యాక్షన్ మూవీని చేస్తున్నాడు. ఈ చిత్రం యొక్క టైటిల్ ను ఇంతవరకు ప్రకటించలేదు. దర్శకుడు ఓ పవర్ ఫుల్ టైటిల్ వెతికి పెట్టె పనిలో ఉన్నాడు.
ఈ చిత్రాని ద్వారకా క్రియేషన్స్ పై మీర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నాడు. బాలకృష్ణ మూడు పాత్రలో నటిస్తున్న చిత్రం ఇది. ఇందులో ఓ పాత్ర అఘోరా గా కనిపిస్తాడు అని సమాచారం మిగిలిన రెండు పాత్రలపై చిత్ర్ర బృందం నుండి క్లారిటీ రావాలిసి ఉంది. మే 28 న ఈ చిత్రం విడుదల అవ్వుతుంది. గోపిచంద్ మలినేని తో చిత్రం పూర్తి చేసిన తర్వాత తన తదుపరి చిత్రాని అనీల్ రావిపూడి దర్శకత్వంలో చేయనున్నాడు. ఆ సమయానికి అనీల్ కూడా ఎఫ్ 3 షూటింగ్ ను పూర్తి చేసి బాలకృష్ణ కోసం సిద్దంగా ఉంటాడు.