“ఛత్రపతి” సినిమా తెలుగులో బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ను కొల్లగొట్టిన చిత్రం. ప్రభాస్ డౌన్ ఫాల్లో ఉన్న సమయంలో ఈ చిత్రం మంచి విజయం సాదించి పెట్టింది. ప్రభాస్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది. శ్రియ శరణ్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాను బేస్ చేసుకొని ఈ అమ్మడు బాలీవుడ్ లో అవకాశాలు పట్టేసింది. ఈ చిత్రంలో తల్లి పాత్రలో నటించిన భానుప్రియ మరల సినిమాలల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెట్టిల్ అయిపోయింది.
ఇప్పుడు ఈ చిత్రాని బాలీవుడ్ కు తీసుకుపోవాలని పెన్ స్టూడియోస్ భావించింది. అందుకే వివి వినాయక్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో చర్చలు జరపడం మొదలు పెట్టింది. ఈ చిత్రానికి బెల్లంకొండ అయితేనే న్యాయం చేయగలడని భావిస్తుంది. మాస్ కంటెంట్ ఉన్న సినిమా కావున ఆయన అయితేనే కరెక్ట్ గా సెట్ అవ్వుతాడు అని భావిస్తుంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమాలకు యూట్యూబ్ లో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన తెలుగు సినిమాలు హింది డబ్బింగ్ లో లక్షల్లో వ్యూస్ వెళ్లలో కామెంట్స్ వస్తున్నాయి.
ఇదే సరైన సమయం బాలీవుడ్ వెళ్లడానికి అని సాయి ఆలోచనలో ఉన్నాడు. రాజమౌళి రేంజ్ లో మరల ఈ చిత్రాని తీయాలి అంటే అందుకు వివి వినాయక్ అయితేనే కరెక్ట్ అని భావించి ఆయనతో హింది సినిమా ప్రేక్షకులకు అనుగుణంగా స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేయించారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనిలో వినాయక్ బిజీగా ఉన్నాడు. తెలుగులో శ్రియ నటించిన పాత్రలో ఇక్కడ బాలీవుడ్ హీరోయిన్స్ ను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు.
ఇప్పటికే పలువురు హీరోయిన్స్ కలిసి చర్చలు జరిపిన వారు మాత్రం తిరస్కరించినట్లుగా తెలుస్తుంది. శ్రద్దా దాస్, కియరా అద్వానీ, దిశా పటాని, అనన్య పాండే లు ఈ లిస్ట్ లో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ భామలు హింది ఛత్రపతి సినిమాలో నటించేందుకు సిద్దంగా లేరు. ఎందుకు అంటే ఆ చిత్రంలో శ్రియ పాత్రకు అంతా స్కోప్ లేకపోవడమే అని తెలుస్తుంది. మరి బెల్లంకొండ కోసం టాలీవుడ్ హీరోయిన్స్ అయిన ఓకే చేస్తారో లేదో చూడాలి. ఈ చిత్రాణి పెన్ స్టూడియో బ్యానర్ పై నిర్మించనున్నారు.