కేజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్ తో సలార్ అనే చిత్రాని రూపొందిస్తున్నాడు. షూటింగ్ కొరకు తెలంగాణలోని గోదావరిఖని కి చేరుకుంది మొదటి షెడ్యూల్ ను అక్కడే షూట్ చేశారు. తాజా సమాచారం మేరకు మొదటి షెడ్యూల్ యొక్క షూటింగ్ ను పూర్తి చేసి అందరికి షాక్ ఇచ్చాడు ప్రశాంత్ నీల్. ఇన్ని రోజులపాటుగా సింగరేణి లో ఓ యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరించారు. ఓ వైపు కేజిఎఫ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంటూనే మరో వైపు సలార్ చిత్రాని తెరపైకి తీసుకు వచ్చి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు.
ప్రభాస్ అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ స్పీడ్ లో షూటింగ్ జరుపుకుంటు పోతే సెప్టెంబర్ నాటికి షూటింగ్ పూర్తి చేసి డిసెంబర్ చివరిలో విడుదల అవ్వుతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ నటిస్తుంది. హోంబలే ఫిల్మ్ ప్రొడక్షన్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ చిత్రాని నిర్మిస్తుంది. ఇదే బ్యానర్ పై కేజిఎఫ్ సెకండ్ పార్టీ ను నిర్మిస్తున్నారు. సలార్ సెకండ్ షెడ్యూల్ విషయంలో త్వరలో ఓ ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
ఈ చిత్రంలో ప్రతి నాయకుడు పాత్రకోసం కన్నడ హీరో మధు గురు స్వామి ని తీసుకోవాలనే ఆలోచనలో ప్రశాంత్ నీల్ ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మరో ఆప్షన్ గా విజయ్ సేతుపతి నటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ తన తదుపరి సినిమా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ డైరెక్షన్ లో ఆదిపురుష్ అనే చిత్రంలో నటించనున్నాడు. ఈ చిత్రం తర్వాత మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సైన్స్ ఫిక్షన్ మూవీ చేయాలిసి ఉంది. బాలీవుడ్ హీరోయిన్ దీపిక పదుకునె నటించనున్నది.