మెగాస్టార్ చిరంజీవి హీరోగా 1998 లో గుణ శేఖర్ దర్శకత్వంలో చూడాలని వుంది అనే చిత్రం వచ్చింది. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ మెగాస్టార్ కొడుకును కిడ్నాప్ చేసి కలకత్తా కు తీసుకు వస్తాడు. అసమయంలో తన కొడుకును వెతుకుంటూ మెగాస్టార్ అక్కడికి చేరుకుంటాడు. “ఆ సమయంలో యమాహా నగరి కలకత్తా పూరీ” అంటూ చిరంజీవి ఓ పాటను కూడా అందుకుంటాడు. ఈ చిత్రం యొక్క షూటింగ్ కలకత్తా నగరంలోనే జరిగింది. ఆ చిత్రం అప్పట్లో రికార్డ్స్ క్రియేట్ చేసింది.
మరల 19 ఏండ్ల తర్వాత ఖైదీ నంబర్ 150 వ చిత్రం వచ్చింది. తమిళ్ కత్తి సినిమాకు ఈ చిత్రం రీమేక్. తెలుగులో వివి వినాయక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం యొక్క షూటింగ్ ఎక్కువ బాగం కలకత్తా నగరంలోనే జరిగింది. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ తర్వాత సినిమాలోకి రీ ఎంట్రీ ఈ చిత్రంతోనే ఇచ్చాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయని సాదించి పెట్టింది.
తాజాగా మరోసారి కోల్ కత్తా సెంటిమెంట్ ను చిరంజీవి ఫాలో అవ్వుతున్నట్లుగా సోషల్ మీడియా నుండి వార్తలు వస్తున్నాయి. చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్ లో ఆచార్య అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత రెండు రీమేక్ చిత్రాలు లైన్ లో ఉన్నాయి అందులో ఒక్కటి తమిళ్ లో అజిత్ హీరోగా నటించిన వేదాలమ్. ఈ చిత్రాని తెలుగు లో మెహర్ రమేష్ రీమేక్ చేయనున్నాడు. గతంలో ఈ దర్శకుడు ప్రభాస్ తో బిల్లా అనే చిత్రాను రూపొందించాడు.
చాలా ఏండ్ల తర్వాత చిరంజీవి తో వేదాలమ్ అనే చిత్రం ను తెలుగు లో రీమేక్ చేయనున్నాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ మరియు ప్రీ ప్రొడక్షన్ పనిలో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం యొక్క షూటింగ్ ను కలకత్తా ప్రాంతంలో జరపాలని దర్శకుడు బావిస్తున్నాడు. మరోసారి కలకత్తా సెంటిమెంట్ ను కంటిన్యూ చేస్తూ హిట్టు కొట్టే ఆలోచనలో ఉన్నాడు. ఈ చిత్రంతో ఎలాగైనా విజయం సాదించి మరోసారి కెరీర్ ను ట్రాక్ లోకి తీసుకురావాలని మెహర్ రమేష్ బావిస్తున్నాడు.