బోయపాటి సినిమా వినయ విధేయ రామ చిత్రం తర్వాత రామ్ చరణ్, రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ఆర్‌ఆర్‌ఆర్. ఈ చిత్రంలో మరో కథానాయకుడు గా ఎన్‌టిఆర్ నటిస్తున్నాడు. ఈ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు ఆయన కు జోడీగా అలియ భట్ సీత గా నటిస్తుంది. ఎన్‌టిఆర్ కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్నాడు. ఆయనకు జోడీగా హాలీవుడ్ హీరోయిన్ ఒలివియా మోరిస్ జెన్నిఫర్ గా నటిస్తుంది.
ఈ చిత్రంలో అజయ్ దేవగన్, సముద్రఖని లు నటిస్తున్నారు. ఈ చిత్రాని డివివి దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం దసర కానుకగా అక్టోబర్ 13 న ప్రపంచ వ్యాప్తంగ విడుదల అవ్వుతుంది. ఈ చిత్రంలోని రామ్ చరణ్ యొక్క అల్లూరి సీతారామరాజు టీజర్ కు ప్రేక్షకులనుండి మంచి స్పందన లభించింది. ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ మరో చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రంలో చర్రీ సిద్ద అనే పాత్రలో నటిస్తున్నాడు. ఆయనకు జతగా పూజ హెగ్డే నటిస్తుంది.
ఈ చిత్రాని రామ్ చరణ్ మరియు మరో నిర్మాత నిరంజన్ రెడ్డి లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రీసెంట్ గా ఈ చిత్రం నుండి విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను తీసుకువచ్చింది. ఈ చిత్రాని మే 13 న విడుదల చేస్తున్నారు. ఈ రెండు చిత్రాల్లో రామ్ చరణ్ నటిస్తున్నాడు. ఈ రెండు చిత్రాలు కూడా ఒకే ఏడాదిలో విడుదల అవ్వుతున్నాయి. ఇలా చరణ్ లైఫ్ లో జరగడం మొదటిసారి. ఇప్పటి వరకు ఆయన సినిమాలు ఏడాది కి ఒక్కటి చొప్పున మాత్రమే విడుదల అయ్యాయి.
ఇదే కాకుండా ఈ ఏడాది మెగా ఫ్యామిలీ సినిమాలు ఇంకా ఎనిమిది విడుదల అవ్వుతున్నాయి. పవన్ కళ్యాణ్ రెండు సినిమాలు వకీల్ సాబ్..మరియు రానా పవన్ మూవీ, అల్లు అర్జున్ పుష్ప, వరుణ్ తేజ్, గని, వైష్ణవ్ తేజ్ ఉప్పెన, మరియు క్రిష్ తో చేయబోయే సినిమా, సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్ మూవీ.. చిరంజీవి తెలుగు రీమేక్ లూసిఫర్ కూడా ఉంది.