అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న మూడోవ చిత్రం పుష్ప. గందపు చెక్కలను తరలించే మూటా సభ్యులకు నాయకుడుగా బన్నీ నటిస్తున్నాడు. ఈ చిత్రంలో పుష్పారాజ్ అనే లారీ డ్రైవర్ గా కనిపిస్తాడు. కన్నడ బ్యూటీ రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది. మొదటి షెడ్యూల్ ను ఆంధ్రప్రదేశ్ లోని మారేడుమిల్లి అడవిలో షూటింగ్ జరిగింది.
ప్రస్తుతం బన్నీ, ఇతర కీలక సభ్యులతో కలిసి విశాక లో కొన్ని కీలక సన్నివేశాలను ప్రస్తుతం దర్శకుడు చిత్రీకరిస్తున్నారు. సెకండ్ షెడ్యూల్ వచ్చేసి శ్రీశైలం ఫారెస్ట్ లో ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే దర్శకుడు కొన్ని కీలక ప్రదేశాలను అక్కడ చుట్టి వచ్చాడు అంట. ఇంతవరకు ఎవరు అక్కడ షూట్ చెయ్యని ప్రదేశాలను సుకుమార్ గుర్తించాడని తెలుస్తుంది. శ్రీశైలం డీప్ ఫారెస్ట్ లోకి చిత్రబృందం త్వరలో ప్రవేశించనున్నది. తాజాగా ఫిల్మ్ నగర్ సర్కిల్ నుండి అందుతున్న సమాచారం మేరకు రష్మిక మందన బన్నిలపై ఓ రొమాంటిక్ సాంగ్ ను షూట్ చేయాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడు అంట.
శ్రీశైలం అడవిలోకి వెళ్ళగానే మొదట చేసే పని ఈ ఇద్దరిపై సాంగ్ షూట్ చేయడమే అంట. అందుకు అల్లు అర్జున్, రష్మిక ను ప్రిపేర్ కావాల్సిందిగా దర్శకుడు కోరినట్లుగా తెలుస్తుంది. పుష్ప నుండి ఇప్పటివరకు మాస్ లుక్ లో చూసిన ప్రేక్షకులు… తాజా సమాచారం మేరకు రొమాంటిక్ లుక్ లో చూడబోతున్నారు. ఇప్పటివరకు పుష్ప చిత్రంలో రష్మిక పాత్ర గురించి ఎలాంటి సమాచారం లేదు. ఇకపై పుష్ప లో రష్మిక సందడి మొదలు కాబోతుంది అంటున్నారు. బన్నీ, రష్మిక ల రొమాంటిక్ సాంగ్ కోసం వీరిద్దరికి స్పెషల్ లుక్ ను డిజైన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక మాస్ స్టెప్స్ తో బన్నీ అదరగొట్టబోతున్నాడు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. పుష్ప ఆగష్టు 13 న విడుదల చేస్తున్నారు.