బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ఆర్‌ఆర్‌ఆర్. ఈ చిత్రంలో రామ్ చరణ్, ఎన్‌టిఆర్ లు హీరోలుగా నటిస్తున్నారు. అళియ భట్ట్, ఒలివియా మోరిస్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ నటిస్తుండగా, గిరిజన వీరుడు కొమరం భీమ్ పాత్రలో ఎన్‌టిఆర్ నటిస్తున్నాడు.
ఈ చిత్రం యొక్క విడుదల తేదిపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై చిత్ర బృందం అధికారిక ప్రకటన విడుదల చేసింది. నేడు ఉదయం రాజమౌళి టీమ్ ఈ రోజు ఆర్‌ఆర్‌ఆర్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇవ్వబోతున్నాం అంటూ ప్రకటించింది అనుకున్నట్లుగానే ఈ రోజు రెండు గంటలకు రాజమౌళి నుండి అధికారిక ట్వీట్ ద్వారా ఆర్‌ఆర్‌ఆర్ కు సంబందించిన వార్తా వచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగ అక్టోబర్ 13 న అగ్ని మరియు నీరు కలిసి అపలేని శక్తి గా మీ ముందుకు రాబోతుంది అంటూ రాజమౌళి ప్రకటించాడు. దాంతో పాటుగా రామ్ చరణ్ గుర్రం నడుపుతూ ఎన్‌టిఆర్ బైక్ నడుపుతూ ఉన్న ఫోటోను కూడా రిలీజ్ చేశాడు. ఈ చిత్రంలో రామ్ చరణ్ ను అగ్నితో ఎన్‌టిఆర్ ను నీటితో పొలుస్తూ చూపించాడు. ఆ విదంగానే వీరి టీజర్స్ ను చూపించాడు. ఇప్పటికే ఆర్‌ఆర్‌ఆర్ నుండి వచ్చిన ప్రచార చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ చిత్రం ఫైనల్ ఎపిసోడ్ ను చిత్రీకరించుకుంటుంది.
రామ్ చరణ్, ఎన్‌టిఆర్ లు చేతులు కలుపుతూ క్లైమాక్స్ ను షూట్ చేస్తున్నట్లుగా ఇదివరుకే జక్కన ప్రకటించాడు. సముద్రఖని, అజయ్ దేవగన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంను డివివి దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.