టాలీవుడ్ లో హిట్టయిన చాలా చిత్రాలు బాలీవుడ్ లో రీమేక్ అవ్వుతున్నాయి. ఒక్కప్పుడు అక్కడి సినిమాలు ఇక్కడ రీమేక్ అయ్యేవి ఇప్పుడు ట్రెండ్ మారింది. సౌత్ సినిమాలపై బాలీవుడ్ దర్శక నిర్మాతలు ఓ కన్నేసి ఉంచుతున్నారు. ఏదైనా చిత్రం హిట్టైతే చాలు రీమేక్ కి ప్లాన్ చేస్తున్నారు. తాజాగా రవి తేజ నటించిన క్రాక్ విడుదలై మంచి టాక్ ను దక్కించుకుంది.
బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ ను రాబడుతుంది. ఈ చిత్రానికి గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించాడు. రవి తేజ ఈ చిత్రంలో పవర్ ఫుల్ పోలీసు ఆఫీసర్ పాత్రలో నటించాడు. మాస్ రాజ సరసన శృతిహాసన్ కథానాయికగా నటించింది. తమిళ దర్శకుడు సముద్రఖని కీలక పాత్రలో నటించాడు. ఇప్పుడు ఈ చిత్రాన్ని బాలీవుడ్ లో రీమేక్ చెయ్యాలని సోనూ సూద్ ప్రయత్నిస్తున్నాడు. నిర్మాత మధుతో రీమేక్ రేట్స్ పై సంప్రదింపులు జరిపినట్లుగా సమాచారం.
అవసరమైతే క్రాక్ హింది రీమేక్ లో తానే నిర్మాత గా మారి హీరోగా నటించాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తుంది. ఈ చిత్రంలో రవి తేజ పవర్ ఫుల్ ఆఫీసర్ పాత్రకు సోనూ సూద్ బాగా కనెక్ట్ అయ్యడంట. అందుకే ఈ క్రాక్ రీమేక్ హక్కులను కొనబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో వాస్తవం ఎంత ఉందో తెలియాలంటే మరికొన్ని రోజులు అగాలిసిందే. రవి తేజ చిత్రాలు ఇంతవరకు బాలీవుడ్ రీమేక్ కి వెళ్లలేదు. అన్నీ అనుకూనట్లుగా జరిగితే రవి తేజ క్రాక్ చిత్రం బాలీవుడ్ కి వెల్లుతున్న మొదటి చిత్రం అవ్వుతుంది.