రవి తేజ నటించిన క్రాక్ చిత్రంకు ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ రావడంతో థియేటర్స్ ముందు హౌస్ ఫుల్ బొర్డ్స్ దర్శనం ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో వరంగల్ డిస్ట్రిబ్యూటర్ శ్రీను దిల్ రాజు పై ఆరోపణలు చేశాడు. తను డిస్ట్రిబ్యూట్ చేసిన క్రాక్ చిత్రంకు థియేటర్స్ ను తగ్గించడంపై నిర్మాత దిల్ రాజు పేరును కిల్ రాజు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ఈ క్రమంలోనే ఆయన ఉస్మానియా యునివర్సిటి జేఏసి వద్దకు వెళ్ళి తనకు ఈ విషయంపై సాయం చెయ్యాలిసిందిగా శ్రీను కోరాడు. ఈ విషయంపై నిర్మాతల్లో చర్చ మొదలైంది. ఈ విషయంపై మాస్టర్ చిత్రం నైజాం డిస్ట్రిబ్యూటర్ స్పందించాడు. ఆయన శ్రీనుకి రివర్స్ కౌంటర్ ఇచ్చాడు. శ్రీను చేసిన ఆరోపణలపై నిర్మాత దిల్ రాజు మాత్రం సైలెంట్ గా ఉన్నాడు. నైజాం డిస్ట్రిబ్యూటర్ మహేశ్ కోనేరు మాట్లాడుతూ సంక్రాంతి సమయంలో థియేటర్స్ ను పంచుకోవడం సహజంగా జరుగుతూ ఉంటుంది.
ఆ సమయంలో అందరూ తమ ఆదాయాలను పంచుకుంటారు అన్నారు. దిల్ రాజు నిజంగా మోసం చేసినవాడు అయితే ఇంత పెద్ద డిస్ట్రిబ్యూటర్ గా రాణించేవాడ అంటూ ప్రశ్నించాడు. 150 థియేటర్స్ లో విడుదలైన మాస్టర్ చిత్రం ఇప్పుడు 75 థియేటర్స్ కి వచ్చింది అయిన నాకు సంతోషమే అన్నారు. ఏమైనా సమస్య ఉంటే శ్రీను వచ్చి మాట్లాడుతే సరిపోతుంది అన్నాడు. ఇలా దిల్ రాజును దూషించడం సరికాదు అన్నాడు. ఈ విషయంపై నిర్మాతల గిల్డ్ లో చర్చ నడుస్తుంది. దిల్ రాజు కు సపోర్ట్ గా నైజాం డిస్ట్రిబ్యూటర్ స్పందించాడు.