RX 100 చిత్రంతో ఇండస్ట్రీ కి పరిచమైన పాయల్ రాజ్ పుత్..మొదటి సినిమాతోనే ఎంత కిక్ ఇవ్వాలో అంత ఇచ్చింది. ఈ భామ ఇచ్చిన కిక్ ఇప్పటికి యూత్ మరచిపోలేకపోతున్నారు. రీసెంట్ గా వెంకిమామ , డిస్కో రాజా చిత్రాలతో ఆకట్టుకుంది. తాజాగా షూటింగ్ లకు అనుమతులు రావడం తో తన కొత్త సినిమా షూటింగ్ లో బిజీ అయ్యింది.
అలాగే ఈ బ్యూటీ సోషల్ మీడియా లోను ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుందనే సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా ఫొటోషూట్స్‌తో రచ్చ చేస్తున్న ఈ అమ్మడు ఈ మధ్యనే తన ప్రియుడి ఫొటోను పోస్ట్ చేసి షాక్ ఇచ్చింది.
‘హ్యాపీ బర్త్ డే మై లవ్’ అంటూ తన ప్రియుడు సౌరబ్ దింగ్రా పోస్ట్ చేసిన ట్వీట్‌ని రీ ట్వీట్ చేస్తూ లవ్ ఎమోజీలను జత చేసింది. ఈ మేరకు సౌరబ్ దింగ్రాతో కలిసి తాను దిగిన ఓ పిక్ షేర్ చేసింది. ఇక ఇప్పుడు మరో పిక్ ను పోస్ట్ చేసి ప్రియుడితో ఎంత ఎంజాయ్ చేస్తుందో చెప్పకనే చెప్పింది.