ఢిల్లీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ కరోనా మహమ్మారి నుండి క్షేమంగా బయటపడింది. వారం రోజుల క్రిందట తనకు కరోనా సోకిందని స్వయంగా ప్రకటించిన ఆమె.. తాజాగా తాను కరోనా టెస్ట్ చేయించుకుంటే నెగెటివ్ వచ్చిందంటూ ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టింది. వారం రోజుల పాటు హోమ్ క్వారంటైన్‌లో ఉన్నానని, తాను కరోనా నుంచి కోలుకోవాలని ప్రార్దించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అని తెలిపింది రకుల్.
”కరోనా నుంచి ఇంత త్వరగా కోలుకున్నానని చెబుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ప్రస్తుతం క్షేమంగా ఉన్నా. మీరు చూపించిన ప్రేమాభిమానాలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతున్నా. 2021ను పాజిటివ్ దృక్పథంతో మొదలు పెట్టాలని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ దయచేసి ప్రతి ఒక్కరు బాధ్యతగా ఉంటూ మాస్క్‌లు ధరించండి. అందరూ భౌతిక దూరాన్ని పాటిస్తూ కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాను” అని తెలిపింది. ఇక రకుల్ సినిమాల విషయానికి వస్తే…గతేడాది చేతిలో పెద్దగా సినిమాలు లేని రకుల్.. ఇప్పుడు మళ్లీ బిజీ అవుతుంది. ఈ భామ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తోంది. ఇందులో వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా.. దీనికి కొండ పొలం అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఈ సినిమాతో పాటు తెలుగులో నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో వస్తోన్న చెక్ అనే సినిమా చేస్తోంది. దీంతో పాటు హిందీ , తమిళ్ భాషల్లో సినిమాలు చేస్తుంది.