సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఆదివాసీలతో ముచ్చటించారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రం తో చిత్ర సీమా కు రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. పింక్ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే 80% పూర్తి కాగా..ఆ తర్వాత లాక్ డౌన్ వచ్చి బ్రేక్ ఇచ్చింది. ప్రస్తుతం కేంద్రం షూటింగ్ లకు అనుమతులు ఇవ్వడం తో మళ్లీ షూటింగ్ మొదలుపెట్టారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ అరకు లో జరుగుతుండగా..షూటింగ్ విరామ సమయంలో అక్కడి ఆదివాసీలతో పవన్ ముచ్చటించి, వారి జీవన స్థితిగతుల గురించి అడిగి తెలుసుకున్నారు. అక్కడి ఆదివాసీలు వారి స్థితిగతుల్ని పాట రూపంలో పవన్ కు వివరించారు. దానికి సంబంధించిన వీడియోను పవన్ ట్విటర్‌లో పోస్ట్ చేశారు.
నిన్న 'వకీల్ సాబ్' షూటింగ్ విరామంలో.. అరకు ఆదివాసీల, ఆంధ్ర-ఒరియాలో అడవితల్లితో ముడిపడ్డ వారి జీవన స్థితిగతుల్ని వివరిస్తూ పాడే పాట.. (వింటుంటే బిభూతిభూషణ్ బందోపాధ్యాయ రచించిన 'వనవాసి' గుర్తుకువచ్చింది)
అంటూ ఆ వీడియోను సోషల్ మీడియా లో పంచుకున్నారు.
నిన్న ‘వకీల్ సాబ్’ షూటింగ్ విరామంలో,అరకు ఆదివాసీల ఆంధ్ర-ఒరియా లో అడవితల్లితో ముడిపడ్డ వారి జీవన స్థితిగతుల్ని వివరిస్తూ పాడే పాట .. ( వింటుంటే బిభూతిభూషణ్ బందోపాధ్యాయ రచించిన ‘ వనవాసి’ గుర్తుకువచ్చింది) pic.twitter.com/CkgNP3PSMA— Pawan Kalyan (@PawanKalyan) December 24, 2020