ఎన్నో వందల పాటలతో ప్రేక్షకులను అలరించిన సింగర్ సునీత..త్వరలో రెండో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. డిజిటల్ మీడియా అధినేత రామ్ వీరపనేని తో ఏడడుగులు వేయబోతుంది. రీసెంట్ గా వీరి నిశ్చితార్థం జరిగింది. ఆ ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సునీత తాము త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు చెప్పుకొచ్చింది.
కొద్ది మంది సమక్షంలోనే వీరి నిశ్చితార్ద వేడుక జరిగింది. వచ్చే ఏడాది పెళ్లి పీటలు ఎక్కబోతున్న నేపథ్యంలో వీరి ప్రీ వెడ్డింగ్ కు సంబందించిన పిక్స్ వైరల్ గా మారాయి. ప్రముఖ స్టార్ హీరో నితిన్ ఈ జంటకు ప్రి వెడ్డింగ్ పార్టీ ఇచ్చినట్లు తెలుస్తోంది. నితిన్ మరియు రామ్ వీరపనేని సన్నిహితులు కావడం చేత ఈ పార్టీ ఇచ్చినట్లు తెలుస్తుంది.
సునీతకు19 ఏళ్ల వయసులోనే పెళ్లయ్యింది. ఇద్దరు పిల్లలు పుట్టాక భర్త వేధింపులు భరించలేక ఆమె విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం పిల్లల బాధ్యతను ఆమే చూసుకుంటున్నారు. అయితే కొంతకాలంగా తన వ్యక్తిగత జీవితంపై ఎన్నో పుకార్లు వచ్చినా సునీత వాటిని ధైర్యంగా ఎదుర్కొన్నారు. రెండో పెళ్లి విషయంపై కొద్దిరోజులుగా వార్తలొస్తున్నా ఆమె స్పందించలేదు. తాజాగా ఎంగేజ్మెంట్ చేసుకుని అన్నింటికీ చెక్ పెట్టేసింది.