ఆర్పీ పట్నాయక్ ..పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చిత్రం , నువ్వు నేను , మనసంతా నువ్వే , సంతోషం ఇలా వరుస సూపర్ మ్యూజికల్ హిట్స్ తో అతి తక్కువ టైం లోనే టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే కెరీర్ పీక్స్‌లో ఉండగానే ఆర్పీ పట్నాయక్ సడెన్‌గా సినిమాలకు దూరం కావడం సంగీత ప్రియులు షాక్ కు గురైయ్యారు. ఆర్పీ సినిమాలకు దూరం కావడం వెనుక దీనికి గార్జునే కారణమని అప్పట్లో వార్తలొచ్చాయి. అయితే ఇందులో ఎంత నిజం ఉందనేది తాజాగా ఆర్పీ క్లారిటీ ఇచ్చారు.
నాగార్జున – ఆర్పీ ల కలయికలో సంతోషం సినిమా వచ్చి మ్యూజికల్ గా పెద్ద విజయాన్ని సాధించింది. ఈ విజయం తో ‘నేనున్నాను’ సినిమాకు ఆర్పీకి ఛాన్స్ దక్కింది. రెండు మూడు ట్యూన్స్ కూడా రెడీ చేసి పెట్టుకున్నారు. ఈలోగా కాల్ షీట్స్ ప్రకారం అదే సమయంలో ఓ ప్రోగ్రామ్ కోసం అమెరికా వెళ్లాల్సి వచ్చింది. ఈ విషయంలో ఆర్పీ పట్నాయక్ మేనేజర్, ‘నేనున్నాను’ టీమ్ మధ్య మిస్ కమ్యూనికేషన్ చోటుచేసుకుంది.
దీంతో ఆర్పీ తమకు చెప్పకుండా అమెరికా వెళ్లిపోయాడని ‘నేనున్నాను’ టీమ్ పొరపాటు పడిందట. ఆయన అమెరికా నుంచి రాగానే ఆ సినిమాకు సంబంధించి ఓ పెద్ద మనిషి వచ్చి నువ్వు మ్యూజిక్ డైరెక్టర్‌గా ఉంటే బిజినెస్ జరగడం లేదు.. అందువల్ల నిన్ను తప్పించామని చెప్పడంతో ఆయన షాకయ్యారట. సినీ ఇండస్ట్రీలో నిర్మాతలు బాగుంటేనే అందరూ బాగుంటారని, తన వల్ల ఏ నిర్మాత ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతోనే తాను పూర్తిగా సినిమాలకు దూరమయ్యానని ఆర్పీ పట్నాయక్ తెలిపారు. అంతే తప్ప ఈ విషయంలో నాగార్జునకు ఎలాంటి సంబంధం లేదని, ఎప్పుడు కలిసినా ఇద్దరం ఆప్యాయంగా మాట్లాడుకుంటామని ఫుల్ క్లారిటీ ఇచ్చారు.