బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 చివరి దశకు చేరుకోవడం తో టైటిల్ విన్నర్ ఎవరు అవుతారా అనే ఆసక్తి పెరిగింది. బుధవారం రోజు ఇంటి సభ్యులలో ఒకరు డైరెక్ట్‌గా ఫినాలే రేసుకు వెళ్లేందుకు రెండో లెవల్ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. టికెట్ టు ఫినాలే మెడల్ దక్కించుకునేందుకు గాను పై నుంచి పడే పూలను సేకరించి మట్టిలో నాటాలి. ఎవరైతే ఎక్కువ పూలు నాటుతారో అందులో చివరి ఇద్దరి తర్వాతి లెవల్‌కు అర్హత సాధిస్తారు అని చెప్పాను బిగ్ బాస్. ముందు రోజు టాస్క్‌లో అవినాష్, అరియానా,మోనాల్ ఔట్ కావడంతో బుధవారం ఎపిసోడ్లో అభిజిత్, అఖిల్, సోహైల్, హారిక ఎవరికి వారే సాటి అన్నట్టు పూలు పట్టుకొనే ప్రయత్నం చేశారు.
ఇదిలా ఉంటె అవినాష్ ను మోనాల్ తన్నడం ఫై ఆమె క్షమాపణలు చెపుతూ.. అవినాష్ కాళ్లు పట్టుకునే ప్రయత్నం చేసింది మోనాల్. నువ్ ఇలా చెయ్యకు.. నువ్ కాళ్లు పట్టుకుంటే వేరేలా వెళ్తుంది.. ఇది కరెక్ట్ కాదు అని చెప్పాడు అవినాష్. ఆ తరువాత తనదైన శైలిలో అవినాష్‌కి హగ్ ఇచ్చి బుగ్గపై ముద్దుపెట్టింది. ఒకసారి ముద్దుపెట్టిన తరువాత అరియానాని పిలిచి మరీ.. అవినాష్ బుగ్గపై రెండో ముద్దు పెట్టింది. ఓకేనా.. చాలా.. అంటూ అవినాష్‌కి కోసరి కొసరి ముద్దులు పెడుతూ కౌగిలితో ఉక్కిరిబిక్కిరి చేసింది మోనాల్. మొత్తం మీద బుధువారం ఎపిసోడ్ లో మోనాల్ ముద్దుల వర్షం హైలైట్ అయ్యింది.