బెల్లంకొండ సాయి శ్రీనివాస్..తెలుగు లో అల్లుడు శ్రీను చిత్రం తో హీరోగా పరిచమై హిట్ కొట్టాడు. ఆ తర్వాత వరుస పెట్టి సినిమాలు చేసినప్పటికీ అవేవి కూడా పెద్ద విజయం సాధించలేదు. ప్రస్తుతం డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటెర్టైనర్ తో కూడుకున్న యాక్షన్ స్క్రిప్ట్ చేస్తున్నాడు. ఇదిలా ఉండగానే బాలీవుడ్ ఎంట్రీ ని ఖరారు చేసుకొని షాక్ ఇచ్చాడు.
మాస్‌కి నచ్చే ‘ఛత్రపతి’ సినిమా రీమేక్‌ను తొలి సినిమాగా ఎంచుకున్నాడు. హిందీ దర్శకులు ఆ కథకు న్యాయం చేయలేరేమోనని భావించి తనకు మొదటి హిట్ ఇచ్చిన వినాయక్ ను నమ్ముకున్నాడు.
పదిహేనేళ్ల పాత కథను ఎంచుకుని తన తెలుగు మార్కెట్‌ను పక్కనపెట్టి ఎక్స్‌క్లూజివ్ హిందీ చిత్రం చేయడం అంత తెలివైన పని అనిపించడం లేదు. హిందీ చిత్ర సీమలోకి అడుగు పెట్టే ఉద్దేశం వుంటే తెలుగులో కూడా విడుదల చేసుకునే ప్రాజెక్ట్ సెట్ చేసుకుని వుండాల్సింది. ఛత్రపతి మంచి మాస్ ఎంటర్టైనర్ అయినా కానీ ఇప్పుడా ఫార్ములా ఫలిస్తుందా అనేది అనుమానమే. మరి చూడాలి బెల్లం కొండ కోరిక ఏమవుతుందో..