చాలా గ్యాప్ తర్వాత కలెక్షన్ కింగ్ డాక్టర్ మోహన్ బాబు హీరోగా నటిస్తున్న చిత్రం ‘సన్ ఆఫ్ ఇండియా’. శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే చిత్ర టైటిల్ పోస్టర్ విడుదల చేయగా, ఇందులో కోపోద్రిక్తుడై తీక్షణ చూపులతో కనిపిస్తున్నారు మోహన్‌బాబు.
‘ఇప్పటివరకు తెలుగు తెరపై రానటువంటి కథాంశమిది. వినూత్నమైన జోనర్లో చేయబోతున్నాం. మునుపెన్నడూ చూడని శక్తివంతమైన పాత్రలో మోహన్‌బాబు కనిపిస్తారు’ అని చిత్రబృందం పేర్కొంది. ఇళయరాజా చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. బుధవారం నుండి హైదరాబాద్‌లో సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ అయింది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నట్లు చిత్రబృందం సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. సుద్దాల అశోక్ తేజ పాటలు రాస్తుండగా, గౌతంరాజు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మోహన్‌బాబుకు స్టైలిస్ట్‌గా విరానికా మంచు వ్యవహరిస్తుండటం విశేషం.