బండ్ల గణేష్ నటుడిగా కోట్లు సంపాధించిన దాఖలాలు ఏమీ లేవు. ఆయన గొప్ప క్యారెక్టర్ ఆర్టిస్టగా కూడా పేరు దక్కించుకోలేదు. అలాంటి బండ్ల గణేష్ అనూహ్యంగా బడా హీరోల చిత్రాలకు నిర్మాత అయ్యాడు. ఆంజనేయులు సినిమా నుండి చరణ్ తో గోవిందుడు అందరి వాడేలే సినిమా వరకు పలు సినిమాలను అది కూడా స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించాడు.
ఆయన ఆర్థిక విషయాలు ఎప్పుడు కూడా అనుమానంగానే ఉంటాయి. ఆయన వద్ద డబ్బు లేకుండానే సినిమాలు నిర్మిస్తాడు అంటూ గతంలో వార్తలు వచ్చేవి. ఇప్పుడు అదే విషయాన్ని బండ్ల గణేష్ చెప్పుకొచ్చాడు. ఆంజనేయులు సినిమాను మొదలు పెట్టిన సమయంలో నా వద్ద ఒక్క రూపాయి కూడా లేదు. కొందరు నాకు ఇచ్చిన ఆర్థిక బలంతో ఆ సినిమాను మొదలు పెట్టాను.
అల్లు అరవింద్ గారి సాయంతో సినిమాను విడుదల చేశాను. ఆ తర్వాత కూడా తీన్మార్ మరియు గబ్బర్ సింగ్ సినిమాలు చేశాను. నేను నా డబ్బులు పెట్టకుండానే ఆ సినిమాలు చేశాను అంటూ బండ్ల విషయాన్ని చెప్పాడు. అంటే ఆయన కొందరికి బినామిగా ఉండి సినిమాలు నిర్మించి ఉంటాడు అంటూ ఆయన వ్యాఖ్యల ద్వరా అనిపిస్తుంది. చాలా కాలంగా ఇదే వాదన వినిపస్తుంది. ఇప్పుడు ఆయనే స్వయంగా ఆ విషయాన్ని చెప్పుకొచ్చాడు.
ఆలీతో సరదాగా కార్యక్రమంలో బండ్లగణేష్ ఈ వ్యాఖ్యలు చేశాడు. తాను స్టార్స్ ను ప్యాంపరింగ్ చేయడం మాయ చేయడం వల్లే నిర్మాతగా మారాను అంటున్నాడు. మళ్లీ కూడా నిర్మాణంలోకి వస్తానేమో అన్నాడు. మొత్తానికి వచ్చే వారంలో ప్రసారం కాబోతున్న ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను ఆయన వెళ్లడి చేసినట్లుగా అనిపిస్తుంది.