అన్న తమ్ముళ్లకు చెల్లి లేదా అక్క ఎంతో ఆప్యాతను ప్రేమను కనబర్చుతూ నేడు రాఖీ కడతారు. తెలుగు సినిమాల్లో ఈమద్య రాఖీ గురించి కాస్త తక్కువ అయ్యింది చూపించడం. కాని ఒకప్పుడు మాత్రం రాఖీ పండుగ గురించి అక్క తమ్ముడు అన్న చెల్లి గురించి ఎన్నో సినిమాలు వచ్చాయి. రాఖీ పేరుతో తెలుగులో ఏకంగా ఒక సినిమానే వచ్చింది అనే విషయం తెల్సిందే. ఎన్టీఆర్ హీరోగా నటించిన ఆ సినిమాకు కృష్ణవంశీ దర్శకత్వం వహించాడు. అన్నా చెల్లెలు, అక్క తమ్ముడు సెంటిమెంట్‌తో టాలీవుడ్లో లెక్కలేనన్ని సినిమాలు గతంలో వచ్చాయి. ఈమద్య కాస్త తగ్గినా స్టోరీలో ఏదో ఒక చోట అక్కతమ్ముడు లేదా అన్న చెల్లి సెంటిమెంట్‌ను చూపుతూనే ఉన్నారు.
ఇక టాలీవుడ్ స్టార్స్ నేడు వారి వారి తోబుట్టువులతో రాఖీ కట్టించుకుని పండుగను జరుపుకుంటూ ఉంటారు. మెగాస్టార్ నుండి మొదలు పెడితే మెగా ఫ్యామిలీలో ఇద్దరు తోబుట్టువులు ఉన్నారు. వారు ఇద్దరు ముగ్గురు సోదరులు అయిన చిరంజీవి నాగబాబు పవన్ కళ్యాణ్ లకు రాఖీు కట్టడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం వారు చిరంజీవితో పాటు నాగబాబు పవన్ కు కూడా రాఖీలు కట్టి వారితో సంతోషాన్ని షేర్ చేసుకుంటూ ఉంటారు. ఈ ఏడాది కూడా చిరంజీవి కి ఆయన సోదరిలు రాఖీ కట్టారు.
బాలయ్య కి కూడా నలుగురు అక్క-చెల్లెల్లు ఉన్నారు…వారిలో భువనేశ్వరి,పురంధ్రేశ్వరితో ఎక్కువ సాన్నిహిత్యం గ ఉంటారు బాలయ్య. హీరో నాని తన అక్క దీప్తి తో చాలా సాన్నిహిత్యంగా ఉంటారు…తరచూ USA లో ఉండే అక్కను కలుస్తూ ఉంటారు.. ప్రతి ఏడాది అక్క కచ్చితంగా తన్నకు రాఖీ పంపుతుంది అని నాని పలు సార్లు చెప్పారు కూడా. .. ప్రస్తుత పరిస్థుతుల వాళ్ళ డిజిటల్ రాఖీ ని జరుపుకుంటున్నారు !
మహేష్ బాబుకు ముగ్గురు సోదరిలు ఉన్నారు. రాఖీ కట్టే విషయాన్ని ప్రత్యేకంగా సోషల్ మీడియాలో పెద్దగా షేర్ చేయకున్నా కూడా మహేష్ బాబు కూడా ప్రతి ఏడాది కూడా తన సోదరిమణుల చేతులతో రాఖీ కట్టించుకోవడం జరుగుతుంది. ఇక సూపర్ స్టార్ ఇంట గౌతమ్ కు సితారతో రాఖీ కట్టించడం నమ్రత చేస్తుంది. ఆ ఫొటోలను కూడా నమ్రత సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ప్రభాస్ కు సొంత చెల్లెల్లు లేకున్నా పెదనాన్న కృష్ణంరాజు కుమర్తెలు రాఖీ కడతారు. ఆ సమయంలో వారికి భారీ బహుమానాలు ఇవ్వడం ప్రభాస్ ప్రతి ఏడాది చేస్తున్నదే. ఈసారి కరోనా అనే భయం ఉన్నా కూడా ప్రభాస్ కు ఇప్పటికే ఆ చెల్లెల్లు రాఖీ కట్టి తమ ఆనందాన్ని షేర్ చేసుకున్నారు.
రామ్ చరణ్‌కు ఇద్దరు సోదరిలు ఉన్నారు. వారు ఇద్దరు కూడా చరణ్ కు రాఖీ కట్టి తమ ఆప్యాయతను కనబర్చుతూ ఉంటారు. వరుణ్ తేజ్‌కు ఖచ్చితంగా నిహారిక రాఖీ కడుతుంది. ప్రతి ఏడాది వరుణ్ ఎక్కడ ఉన్నా కూడా అక్కడకు వెళ్లి మరీ నిహారిక రాఖీ కడుతుందట. పెళ్లికి ముందు నిహారిక రాఖీ కట్టడం ఇదే చివరి సారి అవ్వబోతుంది. ఎందుకంటే నిహారిక త్వరలో పెళ్లి చేసుకోబోతుంది. పెళ్లి తర్వాత కూడా అన్నయ్య వరుణ్ తేజ్‌కు ఆమె రాఖీ కట్టనుంది.
ఇంకా టాలీవుడ్ లో పలువురు స్టార్ హీరోలు డైరెక్టర్స్ మరియు నిర్మాతలు ఇలా అంతా కూడా వారి వారి తోబుట్టువులతో రాఖీ కట్టించుకుని వారి జీవితం సంతోషంగా సాగాలంటూ కోరుకుని ఆశీర్వదించడంతో పాటు తోబుట్టులకు బహుమానాలు ఇవ్వడం కామన్‌గా జరుగుతుంది. మెగాస్టార్ చిరంజీవి రాఖీ కట్టించుకున్న తర్వాత ఇప్పటికి తన చెల్లెల్లకు బహుమానంగా ఏదో ఒకటి ఇవ్వడం జరుగుతూనే ఉంది. ఎంతో మంది స్టార్స్ వారి తోబుట్టువుల పిల్లలను కూడా ఇండస్ట్రీలో పరిచయం చేయడం ద్వారా వారి రుణం తీసుకుంటూ ఉన్నారు. మహేష్ బాబు తన చెల్లి భర్త అయిన సుధీర్ బాబును హీరోగా ప్రోత్సహించడం చేస్తున్నాడు. అలాగే అక్క కొడుకు అయిన గల్లా అశోక్ ను హీరోగా పరిచయం అవ్వడంలో వెనుక ఉండి ప్రోత్సహిస్తున్నాడు. ఇలా తన సోదరికి మహేష్ రాఖీ రుణం తీర్చుకుంటాడు. ఇలాగే అంతా కూడా వారి వారి సోదరికి వారి కుటుంబ సభ్యులకు సాయం చేయడం అండగా ఉండటం చేస్తున్నారు. సినిమాల్లో మాదిరిగానే టాలీవుడ్ స్టార్స్ రియల్ లైఫ్ లో కూడా వారి వారి తోబుట్టువులపై చాలా అన్యోన్యమైన ప్రేమను కనబర్చడం జరుగుతూనే ఉంది.