పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ సినిమా హిట్టు అవ్వడంతో…. ఆయన అభిమానులంతా సంబురాల్లో మునిగిపోయారు. సినిమా విడుదలైన చాలా చోట్ల పాజిటివ్ టాక్ రావడం… మొదటి రోజే భారీ వసూళ్లు చేపట్టడంతో… సోషల్ మీడియా వేదికగా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏపీలో మాత్రం భీమ్లా నాయక్ సినిమా విషయంలో పవన్ అభిమానులు నిరాశ చెందినట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ ని టార్గెట్ చేస్తూ… ఏపీ ప్రభుత్వం కక్ష సాధిస్తుందని ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు.
భీమ్లా నాయక్ సినిమా తర్వాతే టికెట్ల ధరలు పెంచడం… బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వమని ప్రభుత్వం చెప్పడంతో… పవన్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. చిత్తూరులో అయితే ఆందోళ కూడా చేశారు. ఇక మాచర్ల ఏరియాలో అయితే… సినిమా డిస్ట్రిబ్యూటర్స్ నష్టపోకుండా ఉండేందుకు విరాళాలు కూడా సేకరిస్తున్నారు. తమకు చేతనైన సాయం చేస్తామంటూ ఓ డబ్బాకు సినిమా పోస్టర్ అతికించి డబ్బులు సేకరిస్తున్నారు.
అయితే తమ అభిమాన హీరో నటించిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్టు కావాలని కోరుకుంటున్నారు. మలయాళ హిట్ ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’కు రీమేక్ గా తెరకెక్కించిన ఈ సినిమాలో పవన్ కల్యామ్ పోలీస్ అధికారిగా నటించారు. ఆయన్ను ఢీ కొట్టే పాత్రలో రానా కనిపించనున్నారు. నిత్యా మేనన్, సంయుక్త మేనన్ హీరోయిన్లుగా నటించారు. తమన్ సంగీతమందించారు. దర్శకుడు త్రివిక్రమ్ మాటలు అందించారు.