సినీ పరిశ్రమలో విడాకుల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్… ఇలా ఏ సినీ పరిశ్రమలోని చాలా మంది సెలబ్రిటీలు విడాకులు తీసుకుంటున్నారు. అయితే మూడు నెలల క్రితమే చై, సామ్ విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి తెలుగు సినీ పరిశ్రమలో మరో రెండు మూడు జంటలు విడాకులు తీసుకున్నాయి. కోలీవుడ్ లో తమిళ స్టార్ హీరో ధనుష్ తన భార్య ఐశ్వర్యతో విడిపోయినట్లు ప్రకటించారు.
ఇదిలా ఉండగా.. తాజా మరో జంట విడిపోతుందనే అనుమానాలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ, కల్యాణ్ దేవ్ కి విడాకులు ఇచ్చిందనే వార్తలు కొంత కాలం నుంచి తెగ వైరల్ అవుతున్నాయి. గత కొంత కాలం నుంచి కళ్యాణ్ తన కుటుంబంతో కలిసి ఉండకపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
అయితే సమంత మాదిరి గానే శ్రీజ కూడా తన పేరు పక్కన భర్త పేరును తొలగించుకుంది. అప్పటి నుంచి శ్రీజ కళ్యాణ్ దేవ్ తో విడాకులు తీసుకుంటుందనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. మెగా కుటంబం అండగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన కళ్యాణ్.. ఒక హీరోయిన్ తో ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడని. అందుకే శ్రీజ తనతో కలిసి ఉండలేక తన నుంచి విడాకులు కోరుతన్నట్లు తెలుస్తోంది.
అయితే అ హీరోయిన్ ఎవరు, ఏంటనేది మాత్రం ఇంకా బయటకు రాలేదు. ఇటీవలే కళ్ాణఅ దేవ్ మాత్రం తాను చాలా సంతోషంగా ఉన్నానంటూ ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. మరి ఈ విషయం గురించి ఓ క్లారిటీ రావాలంటే మెగా కుటుంబం లేదా కళ్యాణ్ దేవ్ స్పందించాల్సిందే. అప్పుడే ఆ విషయంపై ఓ క్లారిటీ వస్తుంది.
శ్రీజ 2007లో శిరీశ్ భరద్వాజ అనే ఓ వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. అయితే వీరికి ఒక పాప కూడా పుట్టింది. పెళ్లైన కొన్నేళ్లకు అంటే 2014లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత రెండేళ్లకు శ్రీజ కళ్యాణ్ దేవ్ ను వివాహం చేసుకుంది. వీరిద్దరికి కూడా ఓ పాప పుట్టింది.