Kajal Agarwal Demands Huge Remuneration For Chiranjeevi’s 152 Acharyaa
మెగాస్టార్ అయినా మరెవ్వరైనా ఒకే రేటు అంటున్న కాజల్
మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం ఆచార్యకు విచిత్రమైన సమస్య వచ్చి పడినది. ఈ చిత్రంలో హీరోయిన్గా త్రిషను అనుకున్నారు. త్రిష వచ్చి రెండు మూడు రోజులు షూటింగ్లో కూడా పాల్గొంది. అంతా బాగానే ఉంది అనుకుంటున్న సమయంలో తాను ఆచార్య నుండి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించింది. ఆశ్చర్యకరంగా త్రిష తప్పుకోవడంతో ఆమె స్థానంలో వచ్చేది ఎవరు అంటూ గత కొన్ని రోజులుగా మీడియాలో ప్రముఖంగా వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతం సినిమా షూటింగ్‌ను కరోనా కారణంగా వాయిదా వేసినా కూడా హీరోయిన్ విషయంలో మాత్రం చర్చలు జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది. చిరంజీవితో ఖైదీ నెం.150 చిత్రంలో నటించిన కాజల్‌ను మరోసారి చిరుకు జోడీగా నటింపజేస్తే బాగుంటుందనే నిర్ణయానికి కొరటాల వచ్చాడట. అయితే ఆమె పెడుతున్న కండీషన్స్‌తో కొరటాలకు మైండ్ బ్లాంక్ అవుతుందట.
ప్రస్తుతం కాజల్ చేతిలో ఇండియన్ 2 చిత్రం మినహా మరే సినిమా లేదు. ఆమె కెరీర్ ఖతం అయ్యింది అన్నట్లుగానే పరిస్థితి ఉంది. ఇండియన్ 2 కూడా ప్రమాదం కారణంగా షూటింగ్ జరగడం లేదు. అయినా కూడా కాజల్ ఏమాత్రం తగ్గడం లేదు. చిరంజీవితో నటించేందుకు రెండు కోట్లు డిమాండ్ చేసిందట. కోటి రూపాయల వరకు ఇస్తామని చెప్పినా కూడా చిరంజీవి అయినా మరే స్టార్ అయినా కూడా రెండు కోట్లు పారితోషికం అయితేనే చేస్తానంటూ తెగేసి చెప్పిందట. కెరీర్ డల్‌గా ఉన్న ఈ సమయంలో కాజల్ చేస్తున్న డిమాండ్ అందరికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది.