సినిమా లో అవకాశాల కోసం ఎంతో మంది కళాకారులు, దర్శకనిర్మాతల చుట్టూ తమ బయోడేటా ను పట్టుకొని తెగ తిరిగేస్తు ఉంటారు. అయిన కాని ఛాన్స్ లు వస్తాయో రావో తెలియని పరిస్థితి. కానీ నేడు టెక్నాలజి డెవలప్ అవ్వడంతో చాలా మంది యువకులు దాన్ని ఉపయోగించుకొని బాగా ఫేమ్ లోకి వస్తున్నారు. తద్వారా తాము అనుకున్నది సాధిస్తున్నారు. యూట్యూబ్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్, ఫేస్ బుక్ వంటి సామాజిక మాధ్యమాలు రావడంతో అందులో వారు బాగా నేమ్ సంపాదించుకొని వెలుగులోకి వస్తున్నారు. అల చాలా మంది ఇప్పటికే సినిమాలో అవకాశాలు పట్టేశారు. అందులో షణ్ముఖు జస్వంత్ ఒక్కడు.
యూట్యూబ్ లో షణ్ముఖు కు 3 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. షార్ట్ ఫిల్మ్స్, కవర్ సాంగ్స్, వెబ్ సిరీస్ ల ద్వారా బాగా వెలుగులోకి వచ్చాడు. షణు కు యూత్ లో పిచ్చ ఫాలోయింగ్ ఉంది. ఇటీవలే సాఫ్ట్వేర్ డెవలపర్ అనే వెబ్ సిరీస్ తీసి మంచి విజయం సాదించాడు. ప్రస్తుతం సూర్య అనే ఫ్యామిలీ అండ్ లవ్ ఓరియెంటెడ్ వెబ్ సిరీస్ లో షన్ను లీడ్ రోల్ లో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. ప్రస్తుతం సెవెన్ ఎపిసోడ్స్ ను పూర్తి చేసుకుంది. తాజాగా సూర్య వెబ్ సిరీస్ లో షన్ను కు చెల్లెలిగా నటించిన మేఘన ఓ యూట్యూబ్ చానల్ ఇంటర్వ్యూ లో షన్ను గురించి ఆసక్తి కర విషయాలను తెలియజేసింది.
షన్ను ఆఫ్ ది స్క్రీన్ మీతో ఎలా ఉంటాడు అని ఇంటెర్వీర్ అడిగిన ప్రశ్మకు మేఘన సమదానం చెబుతు “నాకు అన్నయ లేడు షన్ను కు చెల్లెలు లేదు.. ఆఫ్ స్క్రీన్ కూడా మేము అన్న చెల్లిలాగే ఉంటాము. షన్ను ఎప్పుడు చాలా స్వీట్ గా చెల్లి అంటుంటాడు. షన్ను సెట్స్ లో ఉంటే చాలా ఆక్టివ్ గా ఉంటాడు. చాలా మంచిగా గైడ్ చేస్తూ ఉంటాడు. చాలా కేరింగ్ చూపిస్తూ ఉంటాడు. నేను కొత్తగా కాబట్టి ని మీద ట్రోల్స్ వస్తాయి. వాటిని నువ్వు చాలా లైట్ గా తీసుకో అని చెప్తుంటాడు. సూర్య 3 వ ఎపిసోడ్స్ లో సూర్య తో నాకు ఎమోషనల్ సీన్ ఉంటుంది. నాకు ఆ సీన్ సరిగ్గా చేయడం రావడం లేదు. అల్మోస్ట్ 20 టెక్స్ అయినాయి. నేను ఆ రోజు అంత ఫుల్ టైడ్ గా ఉండటంతో ఆ సీన్ రావడం లేదు. ఎలాగైనా ఆ సీన్ చెయ్యాలని రిహార్సల్స్ చేసినట్టుగా చేశాను. అంతే ఆ టెక్ ఓకే చేశారు. అప్పుడు నాకు తెలియకుండానే కెమెరా పెట్టి ఆ టెక్ చేశారు. అప్పుడు నాకు ఏడుపు వచ్చింది. అప్పుడు షన్ను నే ఎందుకు ప్రతి విషయానికి ఏడుస్తావు. ఇది కామన్ ప్రతి ఒక్కరికి ఇలాగే జరుగుతూ ఉంటుంది. అప్పుడే మనం ఇంకా బాగా ఎలా చెయ్యాలో తెలుస్తుందని షన్ను చాలా ధైర్యం చెప్పాడు.. అంది.