మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు సినిమాలో అవకాశాల కోసం చాలా కష్టపడ్డాడు. కమెడియన్ సునీలో తో కలిసి ఒకే రూంలో ఉండేవారు. సునిల్ సినిమాలో ఛాన్స్ లకోసం ట్రై చేస్తూ ఉంటే త్రివిక్రమ్ మాత్రం రచయత గా ట్రై చేసేవారు. సునీల్ చాలా సందర్భాల్లో వారు పడ్డ కష్టాలను చెప్పేవాడు. అలాంటిది ఇప్పుడు ఒక్కరు హీరో కం కమెడియన్ అయితే మరొకరు సినిమా రచయత ప్లస్ దర్శకుడు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ మొదట స్వయంవరం సినిమా కు రచయత గా డైలాగ్ రైటర్ గా పనిచేసి మంచి హిట్ కొట్టాడు అక్కడి నుండి త్రివిక్రమ్ ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇప్పుడు ఏకంగా స్టార్ హీరోలు సైతం త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఆయన దర్శకత్వం వహించిన మొదటి సినిమా నువ్వే నువ్వే తరుణ్, శ్రేయ హీరో హీరోయిన్స్ గా నటించారు. ఈ చిత్రం 2002 లో వచ్చి మంచి విజయాన్ని అందించింది.
అదే టైంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ సౌజన్య అనే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆమె తన జీవితంలో అడుగు పెట్టడంతో త్రివిక్రమ్ లైఫే మారిపోయింది. వరస సినిమా హిట్స్ తో దూసుకెళ్ళాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ మరియు సౌజన్య ల పెళ్లి ఫోటో అంతర్జాలంలో తెగ చెక్కర్లు కొడుతుంది. అప్పుడు త్రివిక్రమ్ చాలా లావుగా కనిపిస్తున్నాడు. ఈ ఫోటోపై నెటిజన్స్ త్రివిక్రమ్ ఇప్పటికీ మరియు అప్పటి ఫోటోకు చాలా తేడా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ పెళ్లి లో ఓ ట్విస్ట్ ఏమిటి అంటే నిజానికి త్రివిక్రమ్ చేసుకోవాలిసింది సౌజన్య వాళ్ళ అక్కని కానీ సౌజన్య నచ్చడంతో ఆమెనే పెళ్లి చేసుకున్నాడు. వీరి పెళ్లి చూస్తుంటే మనకు బొంబాయ్ సినిమా గుర్తుకు వస్తుంది కదా.. ఇంచు మించు అలాగే ఉంటుంది. వీరి పెళ్లి స్టోరీ. ప్రస్తుతం త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ సినిమాకు డైలాగ్ రైటర్ గా పనిచేస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత మహేష్ బాబు తో ఓ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు.