నేటి సమాజంలో సోషల్ మీడియా ను ప్రతి ఒక్కరు తమ అవసరాల కోసం వాడుకుంటున్నారు. వాట్స్ అప్, ఫేస్ బుక్, ట్విట్టర్, ఇంస్టా గ్రామ్ ఇలా ఎన్నో సామాజిక మాధ్యమాలు అందుబాటులో ఉన్నాయి. ఈ సైట్ల ను కొంతమంది మంచి కి వాడుతుంటే మరికొందరు తమ వ్యక్తి గత స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగిస్తున్నారు. అందువలన చెడు ఎక్కువగా బయటకు వస్తుంది. అందుకే ఆయా సైట్ల యజమానులు కొన్ని నియమాలు, నిబందనలు కలిగి ఉంటారు.
వాటిని ఎవరైన ఉల్లంగిస్తే మాత్రం ఆ అక్కౌంట్ ను బ్లాక్ చేయడం లేదా ఒక్కటి లేదా రెండు సార్లు హెచ్చరించడం వంటివి చేస్తారు. అయిన మారకపోతే మాత్రం పర్మినెంట్ గా అక్కౌంట్ ను బ్లాక్ చేస్తారు.సరిగ్గా అలాంటిదే కంగనా రనౌత్ విషయంలో జరిగింది. ఈమె పేరు చెబితే చాలు బాలీవుడ్ లో చాలా మంది హీరోలకు, దర్శకులకు, నిర్మాతలకు నిద్ర పట్టదు. ఏ విషయం అయిన సరే ముక్కు సూటిగా మొఖం మీద చెప్పే మనస్తత్వం ఆమె సొంతం. ఇక సోషల్ మీడియా లో ఆమె చేసే ట్వీట్స్ ఎంత వైరల్ గా ఉంటాయో అందరికి తెలిసిందే. అందుకే ట్విట్టర్ అధికారులు ఆమె కు బై బై చెప్పారు. అందుకు కారణం. నిబంధనలు ఉల్లంగించి ఆమె ట్వీట్ లు చెయ్యడం తో ఆమె అక్కౌంట్ పర్మినెంట్ గా బ్లాక్ చేశారు.
ట్విట్టర్ ఆమెకు టాటా చెబితే కూ అప్ ఆమెకు వెల్కమ్ చెప్పింది. కూ అప్ లో చేరిన కంగనా ట్విట్టర్ ను ఉద్దేశించి… నా భావాలను వ్యక్తం చేయడానికి అనేక సోషల్ మీడియా మాధ్యమాలు ఉన్నాయి అంటూ కూ అప్ మనకు సొంత ఇల్లు వంటిది మిగతావి అద్దె ఇల్లు లాంటిది ఎంతకాలం అద్దె ఇంట్లో ఉంటాం అంటూ కూ అప్ ద్వారా ఆమె ట్వీట్ చేసింది. ఇప్పుడు ఆ ట్వీట్ ను కూ అప్ కొ ఫౌండర్ అప్రమేయ రాధాకృష్ణ షేర్ చేశారు.
కంగనా అలా చెప్పడాన్ని ఆయన సమర్థించాడు. అవును కూ యాప్ దేశీయంగా రూపొందింది. మన భావాలను వ్యక్తం చేయడానికి కూ సరైనది. కూ మనకు సొంత ఇల్లు లాంటిది అనడంలో కంగనా తప్పేమీ లేదు అని అన్నాడు.