అల్లు అర్జున్ ది ప్రేమ వివాహం. స్నేహ రెడ్డి అనే ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. టాలీవుడ్ మోస్ట్ బ్యూటిపుల్ కపుల్స్ లలో వీరు ముందు వరసలో ఉంటారు. అల్లు అర్జున్ కు ఇద్దరు పిల్లలు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. అమ్మాయి పేరు అల్లు అర్హ. అబ్బాయి పేరు అల్లు అయాన్. సోషల్ మీడియా ద్వారా బన్నీ ఫ్యామిలి ఎప్పుడు ఆక్టివ్ గానే ఉంటుంది. ముఖ్యంగా బన్నీ, కూతురు, కొడుకు తో చేసే అల్లరి అంత ఇంత కాదు. వారు ఏమి చేసిన బన్నీ ఆ వీడియో లను తన ఫోన్ లో బందించి తన అఫిషియల్ సోషల్ మీడియా అక్కౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటాడు.
అల వైకుంటపురంలోని రాములో రాముల పాటకు అల్లు అర్జున్ వేసిన డ్యాన్స్ ను, అల్లు అర్హ దోశ స్టెప్ అని పేరు పెట్టి మరి డ్యాన్స్ చేసింది. ఇటీవలే తండ్రి గుండెలపై నిలబడి డ్యాన్స్ చేయడం. అల్లు అర్హ తండ్రి తో చేసే అల్లరి అంత ఇంత కాదు తన ముద్దు ముద్దు మాటలు, చెష్టలతో అలరిస్తూనే ఉంటుంది. రీసెంట్ గా దోశలు వేస్తూ మరోసారి వైరల్ అయ్యింది.
తాజాగా అల్లు అర్హ దోశలు వేస్తున్న వీడియో అంతర్జాలంలో తెగ చెక్కర్లు కొడుతుంది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రం. బన్నీ కరోనా తో క్వారంటైన్ లో ఉంటే కూతురు దోశలు వేసి ఇస్తుంది. బన్నీ చాలా అదృష్టవంతుడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది మాత్రం బన్నీ దోశ స్టెప్ ను ఇన్స్పైరింగ్ తీసుకుంది అంటున్నారు. మొత్తానికి అల్లు అర్హ ఏది చేసిన వైరల్ అవ్వుతుంది. అల్లు అర్జున్ సినిమా విషయానికి వస్తే ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే చిత్రంలో నటిస్తున్నాడు. కరోనా కారణంగ షూటింగ్ పోస్ట్ పోన్ అయ్యింది.