రాశి ఖన్నా నటిగా ఊహలు గుసగుసలాడే అనే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమానే మంచి సక్సెస్ ను తీసుకు వచ్చింది. ఆ తర్వాత స్టార్ హీరోల సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఆ ఆ తర్వాత తమిళ, మలయాళ చిత్రాల్లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ తన సత్తా చాటుతుంది. హీరోయిన్ గా సినిమాలోకి వచ్చిన కొత్తలో మంచి మంచి పాత్రలు మాత్రమే చెయ్యాలి అనుకున్న కానీ ఇండస్ష్ట్రి కి వచ్చాక ఆ పరిస్థితులు లేవు అంటూ ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది.
ఇక్కడ చాలా టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. తమను తాము నిరూపించుకోవాలి అంటే ఒక్కోసారి మన పాత్రలకు హద్దులు చెరిపెయ్యలిసి వస్తు ఉంటుంది. అలాంటి సినిమా సంఘటనలు నా లైఫ్ లో నేను ఫేస్ చేశాను. అలాంటి సన్నివేశాలు చేసే టప్పుడు ఏడుపు వచ్చేది. కార్ వ్యాన్ లో కూర్చొని కన్నీళ్లు పెట్టిన సందర్భాలు ఉన్నాయి అన్నారు. నా మొదటి సినిమా మద్రాస్ కేఫ్ ఆ చిత్రంలో ఓ బెడ్ సీన్ ఉంటుంది. ఆ బెడ్ పై వేరే వ్యక్తితో నేను రొమాన్స్ చెయ్యాలి..
ఆ సమయంలో నేను చాలా బాద పడ్డాను నా బెడ్ పై వేరే వ్యక్తి ని ఊహించుకోలేకపోయాను. ఆ తర్వాత విజయ్ దేవరకొండ తో వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో కూడా అలాంటి సీన్స్ ఉన్నాయి. అప్పుడు విజయ్ వచ్చి ధైర్యం చెప్పి ఆ బెడ్ సీన్స్ ను చేశాను. అలాంటి సన్నివేశాలు వచ్చినప్పుడు నా మనసు చంపుకొని చేయాలిసి వస్తుంది అని అన్నారు. ప్రస్తుతం రాశి చేతిలో ఎనిమిది సినిమాలు ఉన్నాయి. అందులో రెండు తెలుగు సినిమాలు అయితే మిగతా ఐదు తమిళం సినిమాలు అందులో రెండు కంప్లీట్ అవ్వగ మరో మూడు సెట్స్ పైన ఉన్నాయి. అలాగే ఓ మలయాళం మూవీ ఉంది.