హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా, దర్శకుడు గా, నిర్మాతగా, మంచి పేరు సంపాదించుకున్న నటుడు రవి బాబు. తన ఆఖరి సినిమా ఆవిరి. ఈ చిత్రం తర్వాత మరో సినిమాను తెరపైకి తీసుకురాలేదు. ఈ మూవీ నిరాశ పరచడంతో కాస్త గ్యాప్ తీసుకున్నాడు. ఇలోగా కరోనా తో సినిమా షూటింగ్ లు పోస్ట్ పోన్ అవ్వుతు వచ్చాయి. రవి బాబు కరోనా కాలంలో ప్రజలకు చేతులెత్తి దండం పెడుతూ ప్రతి ఒక్కరు మాస్కూలు ధరించండి, సోషల్ డిస్టెన్స్ పాటించండి.
ఒక్కప్పుడు ఫేస్ మాస్క్ ఒక్కటే వాడేవారు. ఇప్పుడు రెండు వాడమంటున్నారు. ఇంకా మునుముందు మూడు అంటారు, నాలుగు అంటారు దయచేసి మాస్కూలు వాడండి. ఇప్పుడు మనది మనం మూసుకోకపోతే రేపు దండేసి గుడ్డకప్పి మూసేస్తారు. ప్లీజ్ ప్రతి ఒక్కరు సోషల్ డిస్టన్స్ పాటిస్తూ ఉండండి. అవసరం అయితే తప్ప బయటకు రావద్దు. మనల్ని మనం కాపాడుకోవాలి అంటే ఈ తొక్క తోట కూరలు కాదు ఒక్క మాస్క్ మాత్రమే మనల్ని కాపాడుతుంది.
దయ చేసి మిమ్ములను బేగ్ చేస్తున్న అని అన్నారు. దేశ వ్యాప్తంగ కరోనా చాలా తీవ్ర రూపం దాల్చుతుంది. ఇప్పటికే చాలా మంది ప్రాణాలను కోల్పోతున్నారు. ఇన్ని కోట్ల జనాబా గల దేశంలో వైధ్యం అందించాలి అంటే వైధ్య సిబ్బంది కి కూడా తలకు మించిన భారం అవ్వుతుంది. ఇప్పటికే హాస్పిటల్స్, ప్లే గ్రౌండ్స్ మొత్తం కరోనా రోగులతో నిండి ఉన్నాయి. మున్ముందు ఈ కోవిడ్ ఎంత మంది ప్రాణాలు తీస్తుందో అని డాక్టర్స్ ప్రభుత్వ అధికారులు భయపడిపోతున్నారు.