తెలుగు రాష్ట్రాల్లో కరోనా తీవ్రత చాలా భయంకరంగా ఉంది. ఎటు చూసిన ప్రజలు భయం భయం తో బ్రతుకుతున్నారు. ఇంట్లో నుండి బయటకు వచ్చి స్వేచ్చగా తిరిగే ప్రసక్తి లేదు. ఏ హాస్పిటల్ చూసిన కరోనా రోగులతో నిండి ఉంది. ఆక్సిజన్ అందక, సరైన మందులు లేక ప్రజలు ప్రాణాలను కోల్పోతున్నారు. ఏ హాస్పిటల్ లో చూసిన కరోనా రోగుల చావు కేకలు వినపడుతున్నాయి. ఈ విషయంపై సినిమా నటుడు నందమూరి బాలకృష్ణ సోషల్ మీడియాలో ద్వారా తన నియోజక ప్రజలను ఉద్దేశించి మరియు దేశ ప్రజలను ఉద్దేశించి మెసేజ్ ను ఇచ్చారు.
హిందూపురం ప్రజలారా కరోనా తీవ్రత రోజు రోజు కు చాలా ప్రమాదకరంగా మారుతుంది. దయ చేసి ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉంటూ తమ ప్రాణాలను కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశాడు. అలాగే డాక్టర్స్ సూచనల మేరకు సానిటైజర్స్, ఫేస్ మాస్క్ లు వాడుతూ సోషల్ డిస్టెన్స్ పాటించాలని కోరాడు. ఈ రోజు హిందూపురం గవర్నమెంట్ హాస్పిటల్ లో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోవడం చాలా బాదాకరం. ప్రభుత్వం నిర్లక్ష్యం వలనే ప్రాణాలు కోల్పోయారు అని అన్నాడు.
ప్రభుత్వమే వారి కుటుంబాలను ఆదుకోవాలని అన్నారు. ప్రతి ఒక్కరికి 25 లక్షల చొప్పున ప్రభుత్వం తరుపున సాయం అందించాలని డిమాండ్ చేశాడు. అలాగే ప్రభుత్వం ఆసుపత్రులల్లో ఆక్సిజన్ సిలిండర్స్ మరియు మందులు మరియు ఆరోగ్య సిబ్బంది ని అందుబాటులో ఉంచాలని కోరాడు. ఈ విషయంపై రాష్ట్ర హెల్త్ డిపార్ట్ మెంట్ తో మాట్లాడటం జరిగిందని చెప్పాడు. చివరగా బాలకృష్ణ #stayHome #StaySafe అంటు తన లైవ్ ముగించాడు.