త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు కాంబినేషన్ లో మరో సినిమా వస్తే చూడాలి అని ఘట్టమనేని అభిమానులు సోషల్ మీడియా వేధికగా పలు సందర్భాల్లో త్రివిక్రమ్ ను ప్రశ్నిస్తూనే ఉన్నారు. దేనికైనా టైమ్ అనేది ఉంటది అది వచ్చినప్పుడు ఎవరు చెప్పిన కూడా ఆగదు. ఇప్పుడు అదే టైమ్ వచ్చింది. రీసెంట్ గా మహేష్ బాబు తో సినిమా చేయబోతున్నట్లుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రకటించాడు. అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయింది.
మహేష్ తో అతడు సినిమాకు సీక్వెల్ చేయాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. మరికొందరు మాత్రం పోలీసు ఆఫీసర్ పాత్రలో మహేష్ ను మరోసారి చూడాలని ఉందని అడుగుతున్నారు. ఇలా అభిమానులు ఒక్కొరు ఒక్కోరకంగ తమ హీరో పై ఉన్న ప్రేమను చాటుతున్నారు. కానీ దర్శకుడు స్క్రిప్ట్ లో ఏదైతే ఉంటుందో అదే చేస్తాడు. ఏదో ఒక్కసారి మనం చేసిన గేస్ కరెక్ట్ అవ్వుతు ఉంటుంది. కానీ త్రివిక్రమ్ మహేష్ కోసం, అభిమానుల కోరికకు అటు ఇటూగా మహేష్ పాత్రను డిజైన్ చేసినట్లుగా సమాచారం.
దర్శకుడు త్రివిక్రమ్, మహేష్ బాబు ను రా ఆఫీసర్ గా చూపించనున్నాడని వార్తలు వస్తున్నాయి. దేశభక్తి తో కుడి ఓ ఏజెంట్ పాత్రలో మహేష్ కనిపిస్తాడు అని తెలుస్తుంది. తన పదునైన మాటలు స్క్రీన్ ప్లే తో మహేష్ ను హాలీవుడ్ రేంజ్ రా ఏజెంట్ గా చూపించబోతున్నాడు అంట. హాలీవుడ్ స్టార్ హీరో కు ఉండాలిసిన మెటీరీయల్ ఉన్న హీరో మహేష్, రా ఏజెంట్ పాత్రలో కనిపిస్తే బాక్స్ ఆఫీసు లు షేక్ అవ్వలిసిందే. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ నటించనున్నారు అని సమాచారం. నిధి అగర్వాల్, పూజ హెగ్డే లు. ఈ చిత్రాన్ని హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం యొక్క షూటింగ్ గురించి అధికారిక ప్రకటన రానున్నది. 2022 సమ్మర్ లో ఈ చిత్రం విడుదల అవ్వుతుంది.