బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఏకంగా పాన్ ఇండియా రేంజ్ మూవీలు చేసే స్థాయి కి వెళ్ళాడు. ఎంత ఎదిగిన ఒదిగి ఉండే తత్వం ప్రభాస్ ది. ఇది ఆయనతో ఇంతకు ముందు పని చేసిన హీరోయిన్స్ కానీ, దర్శకులు, నిర్మాతలు చెప్పే మాటలు. అలాంటి వ్యక్తి గురించి శృతి హాసన్ మరికొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
ప్రస్తుతం ప్రభాస్ ఆధిపురుష్, సలార్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. కన్నడ కేజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అనే చిత్రంలో ప్రభాస్ మరియు శృతి హాసన్ లు హీరో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మొదటి షెడ్యూల్ ను సింగరేణి గనుల్లో పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో ప్రభాస్ వ్యక్తిత్వం గురించి శృతి హాసన్ మాటల్లో “ప్రభాస్ సెట్స్ లో ఉంటే చాలా సందడిగా ఎప్పుడు చిల్ అవ్వుతు ఉంటాడు. అంత పెద్ద స్టార్ డమ్ ఉన్న కూడా అది ఏనాడు చూపించుకోడు.
అందరితో నవ్వుతు, నవ్విస్తూ చాలా జాలీగా ఉంటాడు. నేను ఇప్పటికి చాలా మంది ని సినిమా ఫీల్డ్ లో కలిశాను.. కాని ప్రభాస్ లాంటి వ్యక్తి ని నేను ఎప్పుడు చూడలేదు. చాలా మంది పైకి నాతో ఫేక్ స్మైల్ ఇస్తూ లోపల కల్మషం తో ఉన్నవారిని చూశాను… ప్రభాస్ లో అలాంటిది ఏమి కనపడలేదు. చాలా ప్యూర్ హార్ట్ లవ్ తో ఉంటాడు. సెట్స్ లో కూడా అంతే వర్క్ విషయంలో చాలా దేడికేటెడ్ గా ఉంటాడు” ప్రభాస్ ను చూసి చాలా నేర్చుకోవచ్చు. అందుకే ప్రభాస్ అంటే నాకు చాలా ఇష్టం అని అంది.
శృతి హాసన్ సినిమాల విషయానికి వస్తే వరస హిట్స్ లో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. ఈ ఏడాది ప్రారంభంలో రవి తేజ క్రాక్ తో హిట్ కొట్టింది. అలాగే పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ లో కూడా మంచి క్యారెక్టర్ చేసి విజయం అందుకుంది. ఇప్పుడు ప్రభాస్ తో సలార్, పాన్ ఇండియా మూవీ లో నటిస్తుంది. తమిళంలో కంటే శ్రుతికి తెలుగులోనే ఎక్కువ అవకాశాలు, ఎక్కువ విజయాలు వచ్చాయి.