ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే చిత్రంలో నటిస్తున్నాడు. కరోనా నేపథ్యంలో ఈ చిత్రం యొక్క షూటింగ్ ను పోస్ట్ పోన్ చేశారు. బన్నీ పక్కన రష్మిక మందన్న కథానాయక గా నటిస్తుంది. ఇటీవలే ఈ చిత్రం నుండి విడుదలైన టిజర్ చాలా ప్రామిసింగ్ గా ఉంది. ఆగష్టు 13వ తేదీన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవ్వుతుంది.
ఈ చిత్రం తర్వాత బన్నీ కొరటాల శివ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా మూవీ ని గతంలోనే అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. కాని అనూహ్యంగ కొరటాల శివ తన నెక్స్ట్ సినిమాను ఎన్టిఆర్ తో ప్రకటించాడు. కావున వీరి కాంబినేషన్ లో సినిమా రావడానికి చాలా సమయం పట్టేలాగా ఉంది. ఈ నేపథ్యంలో బన్నీ తో సినిమా చెయ్యడానికి మరో ఇద్దరు దర్శకులు లైన్లో ఉన్నారు.
ఇప్పటికే వారు బన్నీ కి స్టోరీ లైన్ ను వినిపించగా వారిని హోల్డ్ లో పెట్టాడు. ఒక్కరు ప్రశాంత్ నీల్. మరొకరు మురగదాస్. అవును ప్రభాస్ తో సలార్ కు ముందే బన్నీ తో సినిమా ఉండబోతుందని వార్తలు వచ్చాయి. కాని అప్పుడు పుష్ప తో బిజీగా ఉండటంతో ఆ ప్రాజెక్ట్ ను పక్కకు పెట్టాడు. ఏఆర్ మురగదాస్ కూడా బన్నీ తో సినిమా చెయ్యాలని ఎప్పటి నుండో ప్లాన్ చేస్తున్నాడు. పుష్ప కంటే ముందే మురగదాస్ బన్నీ కి ఓ స్టోరీ ను చెప్పాడు. కాని ఆ స్టోరీ లో మార్పులు చెయ్యాలిసింది గా బన్నీ కోరడంతో ఆ ప్రాజెక్ట్ అల ఆగిపోయింది.
పుష్ప చిత్రం తర్వాత బన్నీ ఫ్రీ అవ్వనున్నాడు. మురగదాస్ కూడా ప్రస్తుతం సినిమాలు ఏవి చేయకుండా ఖాళీగానే ఉన్నాడు. కావున బన్నీ మురగదాస్ తో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అనే వార్తలు వస్తున్నాయి. ముందుగా మురగదాస్ తో సినిమాను పూర్తి చేసి ఆ తర్వాత ప్రశాంత్ నీల్ తో సినిమాను తెరపైకి తీసుకుపోవాలనే ఆలోచనలో ఉన్నాడు. వీరిద్దరి సినిమా తర్వాతే కొరటాల శివ తో సినిమా ఉంటుందని సినిమా నిపుణులు అంటున్నారు.